Free SMS And Earn Part Time Money







12/6/10

వెంకటేష్ ఏ హిరొయిన్ తో వెళ్ళాలో మిరే చెప్పాలి


విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన నాగవల్లి చిత్రం ఆడియో హిట్ అయిన సందర్భంగా డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంది. సోమవారం హైదరాబాదులోని సినీమ్యాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా వెంకటేష్ షీల్డు అందుకున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, బి. గోపాల్ చేతుల మీదుగా కమిలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్, అనుష్క, రిచా తదితరులు అందుకున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. ఎవరూ ప్రధాన హీరోయినో అర్థం కాదు. అనుష్క కలిసుందాం రా అని పాట పాడుతుంది. కమిలినీ ప్రేమించుకుందాం అంటూ ఆడుతుంది. శ్రద్దాదాస్ పెళ్లిచేసుకుందాం రా అని ఆట పట్టిస్తుంది. రిచా మాత్రం లేచిపోదాం రా అంటుంది. ఇంతమంది ఎందుకున్నారు.. అనేది సినిమాలో చూడొచ్చు. పాటలు కథకు తగినట్లుగానే ఉన్నాయి. ప్రతి ఫ్రేమూ అందంగా కన్పిస్తుంది. నిండుగా హీరోయిన్లు కనబడతారు. నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

పి.వాసు మాట్లాడుతూ, పరుచూరి బ్రదర్స్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వాలి అనే రచయిత ఉన్నాడు. ఆయనలా రచయితలు సహకరించారు. గురుకిరణ్ చక్కని సంగీతాన్ని అందించారు. చంద్రబోస్ సాహిత్యం చక్కగా ఇచ్చారు. రీరికార్డింగ్ హైలెట్‌గా ఉంటుంది. 16న సినిమా విడుదలవుతుంది. ఐదుగురు హీరోయిన్లు పోటీపడి నటించారు. వారికి వారి క్యారెక్టర్లు తెలీదు. సెట్‌లోకి వచ్చాక చెప్పినప్పుడు వాటికి అనుగుణంగా చక్కగా నటించారన్నారు.

అనుష్క మాట్లాడుతూ... గురుకిరణ్ మంచి సంగీతాన్ని అందించారు. పైరసీలను ప్రోత్సహించకండి. ఈ సినిమాను పి.వాసు బాగా తీశారు. మంచి అనుభూతి పొందాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వెంకటేష్‌గారి గెటప్స్ చూసి ఆశ్చర్యపోయాను. చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు అన్నారు.
Powered by web analytics software.