12/28/10
ఈ చిత్రాల్లో ఏది హిట్టవుతుంది, ఎవరు సంక్రాతి హీరో అవుతారన్నది చూడాలి.
2011 సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో ముఖ్యమైనవి...బాలకృష్ణ ‘పరమవీర చక్ర’, రవితేజ ‘మిరపకాయ్’, రామ్ గోపాల వర్మ, సునీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు’, రానా ‘నేను నారాక్షసి’, గోపీచంద్ ‘వాంటెడ్’, వాల్ట్ డిస్నీ తొలిసారిగా తెలుగులో సమర్పిస్తున్న ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాలు రానున్నాయి. వీటిల్లో దాసరి, బాలకృష్ణ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ‘పరమవీర చక్ర’ చిత్రం అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుని మంచి మార్కెట్ అవుతోంది. సింహా వంటి ఘన విజయం సాధించిన చిత్రం అనంతరం విడుదల అవుతున్న చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇక రవితేజ..డాన్ శీను తర్వాత విడుదల అవుతున్న ‘మిరపకాయ్’ పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండనుంది. గతంలో రవితేజకు షాక్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కామిడీ చిత్రం ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు’ ఇప్పటికే అన్ని వర్గాల్లో మంచి ఆసక్తిని రేపింది. ఆ తర్వాత ‘నేను నా రాక్షసి’, గోపీచంద్ ‘వాంటెడ్’ చిత్రాలు మాస్ కి బాగా పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక పిల్లా, పెద్ద తేడా లేకుండా అందరనీ ఒకే ఒక్క ప్రోమోతో ఆకట్టుకున్న ‘అనగనగా ఓ ధీరుడు’ కి మార్కెట్ లో మంచి అంఛనాలే ఉన్నాయి. ఈ చిత్రాల్లో ఏది హిట్టవుతుంది, ఎవరు సంక్రాతి హీరో అవుతారన్నది చూడాలి.
Powered by web analytics software. |