Free SMS And Earn Part Time Money







7/15/09

రాం చరణ్ ఏబౌట్ హిస్ మగధీర


తన మగధీర చిత్రం గురించి హీరో రామ్ చరణ్ తేజ మీడియాతో మాట్లాడారు. 'మగధీర' అనుభవాల్ని చరణ్‌ వివరిస్తూ..."గుజరాత్‌లో తీసిన గుర్రం ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే 'బంగారు కోడిపెట్ట...' పాట కూడా. ఒకప్పుడు నాన్నగారు అదరగొట్టేసిన ఈ పాటను ఇప్పుడు నేను చేస్తుంటే చాలా ఉద్వేగపడ్డాను. ఇక కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం. కచ్చితంగా ఈ సినిమా రీ-రికార్డింగ్‌ ట్రాక్స్‌ని ఆడియో సీడీలుగా రిలీజ్‌ చేయొచ్చు. మహామహులైన టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి పనిచేశారు. కెమెరామన్‌ సెంథిల్‌కి హేట్సాఫ్‌ చెప్పాలి. అంత బాగా ఫొటోగ్రఫీ సమకూర్చారాయన' అని తెలిపారు.ఇక ఈ సినిమా తనకే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలుస్తుందనే అంచనాలో ఉన్నారు చరణ్‌. నిజంగా ఈ సినిమా చేయడం తన అదృష్టమని చెబుతున్నారాయన. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో...భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది





Powered by web analytics software.