Showing posts with label jr ntr pavankalyan sakthi lovely. Show all posts
Showing posts with label jr ntr pavankalyan sakthi lovely. Show all posts
11/11/10
War Between Pavan &Jr.ntr
సెప్టెంబర్ లో కొమరం పులి’, బృందావనం’ చిత్రాలు ఢీకొంటాయని, పవన్, జూ ఎన్టీఆర్ [^] మద్య పోటీలో విజేత ఎవరో తేలిపోతుందని అప్పట్లో మీడియాలో కథానాలు బాగానే వినిపించాయి. అయితే ‘పులి’, బృందావనం’ అయిదు వారాల గ్యాప్ తో విడుదలవడం వల్ల రెండిటి మద్య పోటీ జరగలేదు. బృందావనం వచ్చేసరికే పులి తోక ముడిచేయడంతో ఈ సినిమాల మధ్య కంపేరిజన్ కి ఆస్కారం లేకుండా పోయింది. బృందావనంకి జస్ట్ ఏడో రోజుల ముందు వచ్చిన ఖలేజాతోనే ఎన్టీఆర్ సినిమాకి పోలిక వచ్చింది అయితే పులిని కూడా పోటీలో కౌంట్ చేసి అంతిమ విజేత బృందావనం అని తేల్చేశారనుకోండి.
కానీ నిజానికి దసరా సీజన్ ని ‘రోబో’ ఏలేస్తే, బృందావనం దానిని కనపడకుండా పక్కనెక్కడో ఆడింది. ఏదేయితేనేం రెండో స్థానానికి జరిగిన పోటీలో ఎన్టీఆర్ కే టాప్ ప్లేస్ దక్కింది. అంతకుముందు ‘అన్నవరం’తో ‘రాఖీ’గా పోటీ పడ్డప్పుడు దక్కని పైచేయి ఈ సారి అతనికి లభించింది. ఇదిలా వుంటే మళ్లీ పవన్, జూ ఎన్టీఆర్ ల సినిమాల మద్య పోటీ అనివార్యమనిపిస్తోంది. పవన్ ‘లవ్ లీ’, జూ ఎన్టీఆర్ ‘శక్తి’ ఏప్రిల్ ప్రథమార్థంలోనే విడుదలకి సిద్దపడుతున్నాయి. రెండిటి మధ్య జోనర్ లో చాలా డిఫరెన్స్ ఉన్నా స్టార్ వేల్యూ రిత్యా పోటీ తప్పదనిపిస్తోంది. ఈ లవ్ లీ వార్ లో ఎవరు శక్తి మంతుడనిపిచుకుంటాడో చూడాలి మరి.
Subscribe to:
Posts (Atom)
| Powered by web analytics software. |

