Free SMS And Earn Part Time Money







11/18/10

రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో తాను టైగర్ అనే చిత్రాన్నిచుశాడట


రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో తాను టైగర్ అనే చిత్రాన్ని చూసానని, అది ఓ రబ్బిష్ సినిమా అని అన్నారు. అలాగే అది టైగర్ కాదని నిజానికి అది పిల్లి అని, చాలా సీన్స్ లో అది ఎలుక అని కామెంట్ చేసారు. అది చూసిన వారంతా పవన్ కళ్యాణ్ చిత్రం పులికి కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గురించి ఇన్ డైరక్ట్ గా కామెంట్ అని ఫిక్స్ అయ్యారు.

అయితే ఓ మీడియా వ్యక్తి మాత్రం ఉండబట్టలేక వర్మని ఈ విషయమై కాంటాక్ట్ చేసారు. దానికాయన వెంటనే ఈ టైగర్ గురించి ఆ తర్వాత ట్వీట్ లో మరింత విస్తారంగా రాసా చదవలేదా అన్నారు. ఆ తరువాత ట్వీట్ లో ఏం రాసాడంటే...అది ఆంధోని క్విన్స్...టైగర్స్ డోంట్ క్రై చిత్రమని, కాన్సెప్ట్ వైజ్ గా గొప్ప సినిమా అని, అయితే ఫెరపార్మెన్స్, టేకింగ్ వైజ్ గా చెత్త చిత్రమని రాసారు. దాంతో కావాలని జనాన్ని మిస్ లీడ్ చేసి పవన్ పులి ని గుర్తు చేయటానికా లేక 1981లో విడదలైన టైగర్స్ డోంట్ క్రై చిత్రాన్ని నిజంగానే చూసి ట్వీట్ చేసారా అన్నది సందేహంగా మిగిలిపోయింది. అయితే ముప్పై ఏళ్ళనాటి ఓ ఫ్లాప్ చిత్రాన్ని హఠాత్తుగా గుర్తు చేసుకుని, ట్వీట్ చేయాల్సినంత పనేమి వచ్చిందనేది అందరికీ మరో సందేహం కలిగే అంశం.




Powered by web analytics software.