కరెక్టే....'మిరపకాయ్' లో ప్రకాష్‌రాజ్ పాత్ర అవసరం లేదు. ఆ పాత్ర చిన్న గెస్ట్ రోల్‌లా అనిపించింది చాలామందికి. నా స్నేహితులు కూడా ఇదే అన్నారు. కానీ అంతర్జాతీయ నేరస్తుడ్ని మాస్ హీరో ఢీ కొట్టాలంటే..అంతటి రేంజ్ ఉన్న నటుడేకావాలి. అందుకు నిడివి తక్కువైనా అతన్నే పెట్టాం అంటూ వివరించారు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం మిరపకాయ్ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే బాలీవుడ్ నటుడు అమితాబ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు రవితేజ. చాలా ఈజ్ ఉన్న నటుడాయన. మళ్ళీ అవకాశం వస్తే రవితేజతో సినిమా చేయాలనుంది అన్నారు
హీరో రవితేజ సెట్లో ఉంటే చాలా సరదాగా గడిచిపోయేది. 'షాట్ రెడీ' అనగానే తన పాత్రలోకి వెంటనే లీనమైపోయేవారు. ఎన్నో సలహాలు ఆయన్నుంచి తీసుకున్నా. డాన్స్ కూడా చేసి చూపించేవారు. ఎన్నో రకాలుగా సహకరించాడు..ఆయన్ని మరవటం కష్టం అంటోంది రిచా గంగోపాధ్యాయ. తాజాగా ఆమె చేసిన మిరపకాయ్ చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ తన షూటింగ్ అనుభవాలు గుర్తు చేసుకుంది. అలాగే...చిత్రం షూటింగ్ పూర్తయింది అనగానే..అప్పుడే అయిపోయిందా! అనే బాధకలిగిది. దర్శకుడు హరీష్ శంకర్ కు ఇది రెండో సినిమా. సీనియర్ దర్శకుడిలా టేకింగ్ చూపాడు. లీడర్ తర్వాత మరో మంచి పాత్ర లభించింది. నటనికి అవకాశమున్న పాత్ర దొరకటం అదృష్టం అంది. అలాగే రవితేజతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని వివరించింది.
రవితేజ తన తాజా చిత్రం మిరపకాయ్తో నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ గా మారారు. రెమ్యునేషన్ బ్యాలన్స్ నిమిత్తం నిర్మాత పుప్పాల రమేష్ ఈ రైట్స్ ని రవితేజకు ఇచ్చారు. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ద్వారా రవితేజ ఈ చిత్రాన్ని తనకిచ్చిన ఏరియాని పంపిణీ చేసుకుంటున్నారు. అయితే కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా స్టడీగానే ఉన్నా ఊహించిన విధంగా విపరీతమైన కలెక్షన్స్ రావటం లేదని, సేఫ్ గా మాత్రం బయిటపడే అవకాశం ఉందని అంటున్నారు.