1/20/11
నట్టి కుమర్ యుద్దం మొదలు:నట్టికుమర్ నా మనిషి:దాసరి
తరుణ్, శ్రీహరిలతో నట్టికుమార్ 'యుద్ధం' సినిమా నిర్మిస్తున్నారు. విశాఖ టాకీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు భారతి గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.సి.ఆర్. హాజరుకావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. డా|| దాసరి నారాయణరావు, డి.రామానాయుడువంటి వారు హాజరయ్యారు. వీరిద్దరి చేతులమీదుగా చిత్రం ప్రారంభమైంది. దాసరి మాట్లాడుతూ- నట్టికుమార్ నా మనిషి. చిన్నతనం నుంచి నా వద్దనే ఉండి నిర్మాతగా మారి అరవై సినిమాలు తీశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా ఎదిగాడు. స్వయంకృషితో పైకి ఎదిగాడు. ఈ చిత్ర టైటిల్ కూల్‌ఫైట్‌లా ఉంటుంది. ఫైట్ ఈజ్ ది రైట్ అనేది కాప్షన్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. రామానాయుడు మాట్లాడుతూ- నట్టికుమార్ చూస్తుండగానే ఎదిగిపోయాడు. చక్కటి టైటిల్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, భారతిగణేష్ ఏడాదినాడు కథ చెప్పాడు. మంచి కాన్సెప్ట్. తరుణ్ అంటే ఇష్టం. మా కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా. తప్పకుండా ఆదరిస్తారనుకుంటున్నాను అన్నారు. తరుణ్ మాట్లాడుతూ- నట్టికుమార్‌గారి 60వ సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. కథ చెప్పినప్పుడు కళ్ళకుకట్టినట్లు సినిమా కనబడింది. ఇందులో పాత్రలన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. సినిమాలో ప్రతి ట్విస్ట్‌కు సమాధానముంటుంది. దర్శకుడు బాగా తీస్తాడనే నమ్మకముంది. ఈసినిమా ద్వారా యామి అనే నటి పరిచయం అవుతుంది. శ్రీహరిది పవర్‌ఫుల్ పాత్ర అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ఇది సస్పెన్స్‌తో కూడిన యూత్‌ఫుల్ సినిమా. మాస్‌లీడర్‌కి విద్యార్థి నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఈ సినిమాలో ప్రేక్షకుడు ఊహించినది జరగదు. అన్ని అంశాలతో కమర్షియల్‌గా తీస్తున్న చిత్రమిది' అన్నారు. నట్టికుమార్ మాట్లాడుతూ- దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా బాగుందనిపించింది. ఫైర్ ఉన్న పాత్రను శ్రీహరి పోషిస్తున్నాడు. రెగ్యుల్ షూటింగ్ ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరిలో జరిగే రెండు షెడ్యూల్స్‌లో ఏప్రిల్‌లో జరిగే చివరి షెడ్యూల్‌లో సినిమా పూర్తవుతుంది. అదే నెలలో విడుదలచేయనున్నాం అన్నారు.
Powered by web analytics software. |