7/22/09
దిల్ రాజుపైనా నిషేధం
ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కూడా ఫిలిం ఛాంబర్ నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణయం ఫిలిం ఛాంబర్ ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్ర పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఇటీవలే మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్‌కి సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు ఈ ఆంక్షలను ఉల్లంఘించి తన జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ లైవ్‌ని మా టీవీకి ఇచ్చారు. దీంతో దిల్ రాజు తీరుపై ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్‌కు మాత్రమే పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన మగధీర ఆడియో పంక్షన్ కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మా టీవీలో లైవ్ ఇచ్చారు. అటు అల్లు అరవింద్, ఇటు దిల్ రాజు ఇద్దిరిపై ఏక కాలంలో ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోవచ్చిన తెలుస్తోంది.
Powered by web analytics software. |