దక్షిణాదిన సీక్వెల్ చిత్రాల నిర్మాణం క్రమేణా ఊపందుకున్న తరుణంలో దర్శకుడు పి.వాసు 'చంద్రముఖి' సీక్వెల్ తో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కన్నడంలో రూపొందించిన 'ఆప్తమిత్ర' చిత్రానికి రీమేక్ గా వాసు ఆమధ్య రజనీకాంత్ తో తీసి 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వాసు మళ్లీ రజనీతోనే 'కథానాయకుడు' తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం చవిచూసింది. ఈ నేపథ్యంలో పి.వాసు మరోసారి కన్నడంలో 'ఆప్తమిత్ర-2' తీస్తున్నారు. తొలి వెర్షన్ లో నటించిన విష్ణువర్దన్ ఈ సీక్వెల్ లో కూడా హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో హీరోయిన్లుగా సంధ్య , భావన, లక్ష్మీ గోపాల స్వామి, విమలా రామన్ నటిస్తున్నారు. అయితే మెయిన్ రోల్ అయిన చంద్రముఖి పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది వాసు గుట్టుగా ఉంచుతున్నారు. ఇదే సమయంలో తమిళంలో కూడా రజనీకాంత్ తో 'చంద్రముఖి-2' తీయాలనే పట్టుదలతో వాసు ఉన్నారు.దీనికి రజనికాంథ్ ఒప్పుకుంటారో లేదో ఎందుకంటే సినిమ తరువాత చాలకాలం గెప్ తీసుకున్న రజని వరుసుగ రెండు సినిమలు విడుదల [యంత్రం' ,సుల్తాన్ ది వారియర్']చేయనున్నాడు అటువంటి తరుణంలో వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తాడని చెప్పలేం వాసు మాత్రం రజనికాంత్ అంగీకారానికి వేచి చూస్తున్నాడు 4భాషలలో చంద్రముఖి విడుదల అయింది అందులో మూడు భాషలలో రజని హీరోగా ఉన్నారు.కన్నడంలో మాత్రం విష్ణువర్దన్ నటించాడు వాసు చంద్రముఖి-2 తీస్తున్నట్టే అప్తమిత్ర నిర్మిచడం అనుకొని హీరో తో డేట్ లు కుదరటంతో దాదపు ఈ చిత్రం చివరి దశకు వచ్చింది మరి మిగత మూడు భాషలు రజని చేయవల్సి ఉండగా రజని ఒప్పుకుంటాడో లేదో అని కోలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.