Free SMS And Earn Part Time Money







10/1/09

ఉత్తమ కళాదర్శకుడిగా ఎదగాలంటే ఏం కావాలి

  • కళా దర్శకుడికి ఊహాశక్తి చాలా అవసరం.
  • నిబద్ధత, అభిరుచి దానికి తోడైతే అద్భుతమైన దృశ్యాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు.
  • కొత్తగా ఏది చేసినా దాంతో ప్రేక్షకుడిని మెప్పించగలం.
మయసభలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడం కూడా కళే. ఆనాడు అంతగా కళాదర్శకుల పనితీరు ఉండేది. నేడు మగధీరకు అటువంటి తరహాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని కళాదర్శకుడు రవీందర్ చెబుతున్నారు.
  • ట్‌వేస్తేనే కళాదర్శకుడు కాదు. సన్నివేశానికి తగి
  • ప్రశ్న: ఉత్తమ కళాదర్శకుడిగా ఎదగాలంటే ఏం కావాలి?
  • జ: చాలామంచి ఊహాశక్తి కావాలి. దీనికి అభిరుచి తోడైతే ఆ అద్భుత కళాదృశ్యాలను ప్రేక్షకులు చూడగలరు. కొత్తగా ఏదైనా చేసి ప్రేక్షకుడిని మెప్పించేలా ఉండాలి.
  • సెనట్లు పరిసరాలను సిద్ధం చేయాలి. ఆ విషయం ప్రేక్షకుడికి తెలియకూడదు. మధ్యతరగతి ఇల్లు ఉంటే బుల్లిటీవీ ఉండాలే తప్ప పెద్దటీవీ ఉండకూడదు. ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ప్రశ్న: మీ నేపథ్యం?
  • జ: నెల్లూరు జిల్లా. ఢిల్లీలో ఐఐటిలో ఎం.డి.ఇ.ఎస్. పూర్తిచేశాను. ముందుగా గుణ్ణం గంగరాజు నిర్మించిన "అమృతం" సీరియల్‌కు పనిచేశాను. తర్వాత "ఐతే" సినిమాకు చేశాను. రాఖీ, అష్టాచమ్మా, ఒక్కడున్నాడు, విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాలకు పనిచేశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే మగధీర మరో ఎత్తు.

  • ప్రశ్న: భారీ స్థాయిలో సెట్ వేస్తే సినిమా సక్సెస్ అవుతుందా?
  • జ: ఏదైనా సరే కథలో భాగంగానే సెట్ ఉండాలి. దానికి మించి ఎంత చేసినా అది వృధా అవుతుంది. కథను మరిచి సెట్‌వేస్తే అవి చిత్ర విజయానికి ఎంత మాత్రం దోహదపడవు.

  • ప్రశ్న: మరి మగధీరలో మీరు వేసిన కాళభైరవుని విగ్రహం పునర్జన్మలోనూ చెక్కుచెదరకుండా ఉందనే విమర్శ ఉంది?
  • జ: అవును. చాలామంది అన్నారు. కానీ ఆ విగ్రహం కాలపరిస్థితుల రీత్యా కప్పబడి ఉంది. దుమ్ము, ధూళి అనేవి తక్కువ ఉన్న వాతావరణం అది. కనుక ఎక్కువగా చెడిపోదు. ఆ విషయమే ఓ సన్నివేశంలో చెబుతారు. కానీ ఆ సన్నివేశాన్ని కొన్ని కారణాలవల్ల లెంగ్త్ ఎక్కువైందని తీసేశారు. ఏది ఏమైనా ఆ సెట్‌కు అనూహ్యస్పందన వచ్చింది.

  • ప్రశ్న: మీకు ఆదర్శకులు ఎవరు?
  • జ: తోట తరణి. ఒక విధంగా ఆయనకు నేను ఏకలవ్యశిష్యుడ్ని.

  • ప్రశ్న: మగధీరతో హాలీవుడ్ చిత్రం ఆఫర్ కొట్టారని తెలిసింది?
  • జ: 1983 భోపాల్ ఘటన ఆధారంగా "ఏ ప్రేయర్ ఫర్ రైన్" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు కూడా నేను చేపట్టాను. దీనికోసం బొల్లారంలో సెట్‌వేశాను.

  • ప్రశ్న: మీ తదుపరి చిత్రాలు?
  • జ: ఆర్య-2 చేస్తున్నారు. తర్వాత చంద్రశేఖర ఏలేటి చిత్రం. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే "మర్యాద రామన్న".

  • ప్రశ్న: మీ లక్ష్యం?
  • జ: ఎన్ని చేశామనేదికాదు. 'మగధీర'లాంటి గుర్తిండిపోయే చిత్రాలు ఎన్ని చేశామనేదే నాకు ముఖ్యం.

Powered by web analytics software.