11/30/10
సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచున్న త్రిష,
మాజీ మిస్ చెన్నై త్రిషకు ఉన్నట్లుండి మాతృభాషపై ప్రేమాభిమానాలు పొంగుకొచ్చినయ్. ఇటీవల ఆమె పాల్గొన్న సభలో చాలామంది ఇంగ్లీషులో మాట్లాడుకోవడాన్ని చూసి, ఒక్కసారిగా మైకు అందుకని, దయచేసి అందరూ తమిళ భాషలో మాత్రమే మాట్లాడుకోవలసిందిగా(దైవసైది... ఎల్లారూ తమిళ్ పేసుంగ) విజ్ఞప్తి అంటూ తమిళంలోనే మాట్లాడిందట.
అంతేకాకుండా ఇంగ్లీషు భాషలో మాట్లాడే సంస్కృతి తమిళనాట పెరగడంపై లెక్చరిచ్చిందట. ఇవాళ రేపు అందరూ నాలుగు ముక్కలు ఇంగ్లీషు తెలియగానే లొడలొడమంటూ ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తమిళనాడును ఆంగ్లనాడుగా మార్చేస్తున్నారని మండిపడిందట.
తమిళ భాషపై మమకారంతో మన పెద్దలు మనకంటే ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, ఆ ప్రావీణ్యాన్ని అవసరమైన చోట ప్రదర్శిస్తారే తప్ప తమిళనాడులో కాదని త్రిష గుర్తు చేసిందట. భాషాభిమానం ఇంతగా పొంగిపొర్లతున్న త్రిషకు ముఖ్యమంత్రి కరుణానిధి తమిళభాషాభివృద్ధికి సంబంధించి ఏదైనా పదవి ఇస్తే బావుండు అని అక్కడివారు గొణుక్కున్నారట.
ఎటూ సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచున్న త్రిష, అటువంటి పదవి ఇస్తే వెళ్లిపోతుందేమో అని మరికొంతమంది సెటైర్లు విసరడం కనబడింది.
Powered by web analytics software. |