12/9/10
నాలాంటివారు మరో నలుగురు ఉంటే బాగుండేది అనే భావన [males r females]
మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న మీడియా తో మాట్లాడుతూ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నేనొక్కదాన్నే మహిళను. అంతా మగవారే. నాలాంటివారు మరో నలుగురు ఉంటే బాగుండేది అనే భావన కలిగింది. హీరోల కుమార్తెలు ఎందుకు ఇండిస్టీలోకి రారో అర్థంకాదు. మహిళలు అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నారు. విదేశాల్లో మహిళలు ఎంతోమంది ఇండిస్టీలో ఉన్నారు. ఇక్కడా మహిళలు రావాల్సిన అవసరం ఉంది అని వివరించారు.
ఆమె మీడియా తో మాట్లాడుతూ నరకడాలు చంపడాలు కన్నా శృంగారం చూపడంలో తప్పులేదు, అదికూడా పరిమితంగా ఉండాలి. నా సినిమాలో శృంగారం ఎక్కువలేదు. సన్నివేశపరంగా రొమాన్స్ ఉంటే తప్పులేదు. అది తప్పనుకుంటే ప్రపంచంలో జనాభాలో మనదేశం ఎందుకు ముందుంది. అందుకే సెక్సుఎడ్యుకేషన్ అవసరం ఎంతైనా ఉంది. తిరుమలకొండ శిల్పాల్లో ఎన్నో శృంగారభంగిమలున్నాయి. అవి తప్పుకాదా? దేవుళ్ళకు ఇద్దరు భార్యలుంటే పూజిస్తున్నాంకదా? ఏది ఏమైనా మనలో మార్పురావాలి. మన ప్రతిభనంతా అనవసరమైన విషయాలకే వెచ్చిస్తున్నాం. మహిళకు పెళ్ళయ్యాక భర్తే జీవితం కాదు. దాంతో ఆమె కెరీర్ ఫుల్‌స్టాప్ కాకూడదు. భర్తతోపాటు కెరీర్ సమాజానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి.
Powered by web analytics software. |