Free SMS And Earn Part Time Money







1/12/11

ఫర్వాలేదనిపించే దాసరి 150 "పరమవీరచక్ర" 150 రోజుల ఆడింపు


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా, జీవా, జయసుధ, మురళీమోహన్‌, కళ్యాణి, వేద, నాగినీడు, కోటశ్రీనివాసరావు, అలీ, హేమ, ఎల్‌బి. శ్రీరామ్‌, బ్రహ్మానందం తదితరులు, కెమెరా: రమణరాజు, ఎడింటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: జి. కళ్యాణ్‌, దర్శకత్వం: దాసరి నారాయణరావు.

విడుదల: 12.1.2011

పాయింట్‌: మేజర్‌ దేశద్రోహి కాదనీ తనలాగే ఉన్న మరో వ్యక్తి నిరూపించే ప్రయత్నమే ఈ కథ.

"పరమవీరచక్ర" కథగా చెప్పాలంటే... చిన్న పాయింట్‌. దేశభక్తిని కథావస్తువుగా తీసుకుని దానికి సెంటిమెంట్‌ రంగరించి కోర్టు బోనెక్కి రాజకీయ నాయకుల తీరుపై సెటైర్లు వేసే చిత్రాల కోవలో ఇది వస్తుంది. బొబ్బిలిపులి తరహాలో ఈ చిత్రం సాగుతుంది. ఎన్‌.టి.ఆర్‌. అరెస్ట్‌ చేస్తున్న సన్నివేశంనుంచి తన వారసునిగా మళ్ళీ నేనే పుడతాననే డైలాగ్‌తో సింక్‌ చేస్తూ కథసాగుతుంది.

సినిమా హీరో చక్రధర్‌ (బాలకృష్ణ)కు మిలటరీ అధికారి (మురళీమోహన్‌) ఓ కథ చెబుతాడు. వింటూ వింటూ లీనమైపోతాడు. అతను చెప్పిన జయసింహ పాత్రను ఓన్‌ చేసుకుంటాడు. చక్రధర్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు కొండలకు తీసుకెళ్ళిన ఆఫీసర్‌ జయసింహను చూపిస్తాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని చూపించి.. కొందరు దేశద్రోహులు నిజాయితీపరుడైన చక్రధర్‌ను ద్రోహిగా చిత్రించారనీ, అందుకే ఆయన నిజాయితీని నిరూపించేందుకు అచ్చుగుద్దినట్లుండే నిన్ను వేడుకుంటున్నామని చెబుతాడు. జయసింహను చక్రధర్‌ ఎలా నిరూపించాడన్నది కథ. అలా నిరూపించే క్రమంలో సాగే సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం.

బాలకృష్ణ రెండు పాత్రల్లో పండించారు. 50లో ఉన్నా ఆ స్పీడ్‌ తగ్గలేదు. డాన్స్‌, ఫైట్స్‌ బాగా చేశాడు. డైలాగులు లెంగ్తీ లేకుండా ఉన్నాయి. సినీ హీరోగా ఆయన నిజజీవితంలోని పాత్రకు సరిపోయింది. చిత్రంలో హైలైట్‌ కొమరం భీమ్‌ పాత్ర. రావణాసురునిగా బాగా చేశాడు. అయితే కొమరంభీమ్ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడని ప్రేక్షకులు క్లాప్‌ కొట్టారు. రోయిన్లుగా మేజర్‌ భార్యగా అమీషా పటేల్‌, హీరో అభిమానిగా షీలా, కాస్త నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను నేహాధూపియా పోషించారు.

షీలాతో పాడే పాటలు కాస్త ఇబ్బంది పెట్టిస్తాయి. పక్కామాస్‌ను దృష్టిలో పెట్టుకుని పచ్చిమాస్‌ పాట సాగుతుంది. కామెడీ పండించడంలో 'రోబో'పై సెటైర్‌గా అలీ, బ్రహ్మానందం కామెడీ ఫర్వాలేదు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి మైనస్‌ సంగీతమే. పెద్దగా ఆకట్టుకోలేదు. చిత్రానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది కెమెరా పనితనం. కెమెరా ప్రజెంటేషనే ఇటువంటి కథకు కీలకం. అది కాస్త లోపించింది.

దాసరి సంభాషణలు ఫర్వాలేదు. సినిమా హీరోలు ఎక్కువ తీసుకుంటారనే దానికి ఈ చిత్రంలో వివరణిచ్చే ప్రయత్నం చేశారు. అదీగాక నిర్మాతలు తమకు ఇన్ని కోట్లు లాభం వచ్చిందనేది శుద్ధ అబద్ధమని చెబుతాడు. కథ బాగుంటే కొన్నిసార్లు పారితోషికానికి ఒత్తిడి చేయమని ఇదంతా అపోహ అని వివరణ ఇస్తాడు. మాస్‌ ప్రేక్షకుల గురించి... నేను కొట్టినా చస్తావ్‌, నన్నుకొట్టినా చస్తావ్‌.. వంటి డైలాగ్‌లూ ఉన్నాయి.

దాసరి దర్శకునిగా గతంలో పెద్ద పేరుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ వచ్చాక ఆయన చిత్రాల్లో పస కన్పించడంలేదు. 150 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని దాన్ని ప్రేక్షకుల్ని మెప్పించడంలో కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. అసలు టెక్నాలజీ లేని రోజుల్లోనే మేం సిల్వర్‌ జూబ్లీలు తీశామని దాసరి చాలాసార్లు సభల్లో చెప్పారు. సినిమా హీరోగా పలుపాత్రలు పోషించే విధానంలో దాసరి ప్రతిభ కనబడింది. ఆ పాత్రలు బాగా పేలాయి.

మొదటి భాగం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. రెండవ భాగమే కీలకం. స్క్రీన్‌ప్లేను అద్భుతంగా మలచడంలో రెండవ భాగం పేలవంగా మారింది. సెకండాఫ్‌లో వచ్చే రెండు పాటలు తీసేస్తే సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు కామెడీ ట్రాక్‌తోపాటు యాక్షన్‌ ఎపిసోడ్‌ చూస్తుంటే.. కోడిరామకృష్ణ ఛాయలు కన్పిస్తాయి.

దాసరి, సాహితీ, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌వంటివారు పాటలు రాశారు. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. టోటల్‌గా ఈ చిత్రం అంత తీసిపారేసే సినిమా కాదు. ఒక్కసారి చూడదగ్గ సినిమా. సంక్రాంతిలో తొలుత విడుదలైన సినిమా ఇది గనుక ఇంకా విడుదలకాల్సినవి ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేర
కు ఆదరిస్తారో
చూడాల్సిందే.



వన్ ఇండియా సైట్ అభిప్రాయం:పరమ వీర చెత్త

వెబ్ దునియా అభిప్రాయం:యువరత్న "పరమవీరచక్ర" కేవలం "ఒక్క రోజు సినిమా

మరికొన్ని సైట్లు పర్వలేదు

మొత్తానికి డిజేస్టర్ అయినా 150 రోజుల చిత్రం నిర్మాతకి......!
లేక పోతే దర్శకుని పరువు హీరొ ఇమేజ్ అయిపోవు

కొమరం ,ఖలేజా ,తరవాత అంతటి డిజాస్టర్ అని నా అభిప్రాయం
Powered by web analytics software.