Free SMS And Earn Part Time Money







1/10/11

రోజా సినిమా ఆశలకి బాలకృష్ణ హ్యాండ్


రాజకీయాల్లో తన పాత్ర ఏంటో తనకే తెలీక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న రోజా కనీసం సినీ రంగంలో అయినా నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నా ఇంతదాకా రోజా రీఎంట్రీలో కరెక్ట్ సినిమా పడలేదు. ‘శంభో శివ శంభో’ లో మరీ చిన్న క్యారెక్ట్ చేయడంతో అది ఎవరి గుర్తింపుకీ నోచుకోలేకపోయింది. ‘గోలీమార్’లో ఇంపార్టెంట్ రోల్ చేసినా కానీ అది కాస్తా ఓవర్ అయిందని విమర్శలు అందుకుంది. దాంతో ఇప్పుడు రోజా టీవీల్లో డాన్స్ షోలకి జడ్జిగా వెళుతూ కాలక్షేపం చేస్తోంది.

ఈ తరుణంలో రోజా సినిమా ఆశలకి ఊపిరిపోస్తూ బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’లో ఆమెకి ముఖ్య పాత్ర దక్కింది. బాలయ్యతో రోజా హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో చాలా వరకు విజయం సాధించాయి. ‘భైరవద్వీపం’, ‘బొబ్బిలిసింహం’ తదితర బాలకృష్ణ సినిమాలతోనే రోజా అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ కావడానికి కూడా బాలకృష్ణ హ్యాండ్ తనకి అచ్చివస్తుందని ఆశిస్తోంది
Powered by web analytics software.