Free SMS And Earn Part Time Money







2/26/11

సమంతా జవాబుకి కంగుతిన్న అనుష్క కాజల్


టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ లో ఉన్న కథానాయిక సమంతా, 'నంబర్ గేమ్' పై తన మనసులోని మాటను తాజాగా బయటపెట్టింది. చిన్నప్పటి నుంచీ తనేం చేసినా నెంబర్ వన్ అనిపించుకోవాలని ఉండేదట. అందుకే ఏ రంగంలో వున్నా అదే తన గోల్ అంటోంది. అందుకోసం ఎంతటి కష్టమైనా పడుతుందట. అది తన నైజమని కూడా చెబుతోంది. "ఇప్పటికీ నేనింతే. అందులో మార్పేమీ లేదు" అని కూడా చెబుతోంది. అంటే, ఇప్పుడు టాలీవుడ్ లో తను నంబర్ వన్ స్థానం మీద కన్నేసిందన్న మాట. మామూలుగా ప్రతి హీరోయిన్ కీ నంబర్ వన్ అనిపించుకోవాలని వుంటుంది. కానీ, సమంతా ఆ మాటని ధైర్యంగా పైకి చెప్పేయడంతోనే అందరూ కంగుతింటున్నారు. మిగతా వాళ్ల మాట ఎలా వున్నా అనుష్క, కాజల్ వంటి టాప్ స్టార్లు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారట! ఎందుకంటే, సమంతా నుంచి పోటీ వున్నది వీళ్ళకే!
Powered by web analytics software.