భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే 1913లో ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్ గా 'రాజా హరిశ్చంద్ర' ను తీసేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారో 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ'లో దర్శకుడు పరేష్ మోకాక్షి చూపించబోతున్నారు. 2004లో ఎంపికైన 'శ్వాస్' తర్వాత దేశం నుంచి ఆస్కార్ కు ఎంపికైన రెండో మరాఠీ చిత్రం ఇది కావడం విశేషం. ఇది లో-బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ అనీ, జనవరిలో షూటింగ్ పూర్తయిందనీ మోకాక్షి తెలిపారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, గౌరవం ఈ చిత్రానికి దక్కాయనీ, త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు. ఆస్కార్ కోసం వచ్చే నెల నుంచి తన సినిమాకి ప్రమోషన్ వర్క్ మొదలుపెడతాననీ, ఈ దిశగా ఎంతో అనుభవం ఉన్న అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్, 'శ్వాస్' దర్శకుడు సందీప్ సావంత్ తనకు సహకరించనున్నారనీ ఆయన పేర్కొన్నారు.
9/21/09
'న్యూయార్క్', 'ఢిల్లీ 6' వంటి సుమారు 15 చిత్రాలతో పోటీపడి 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ఈ ఘనతను దక్కించుకుంది.
భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే 1913లో ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్ గా 'రాజా హరిశ్చంద్ర' ను తీసేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారో 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ'లో దర్శకుడు పరేష్ మోకాక్షి చూపించబోతున్నారు. 2004లో ఎంపికైన 'శ్వాస్' తర్వాత దేశం నుంచి ఆస్కార్ కు ఎంపికైన రెండో మరాఠీ చిత్రం ఇది కావడం విశేషం. ఇది లో-బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ అనీ, జనవరిలో షూటింగ్ పూర్తయిందనీ మోకాక్షి తెలిపారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, గౌరవం ఈ చిత్రానికి దక్కాయనీ, త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు. ఆస్కార్ కోసం వచ్చే నెల నుంచి తన సినిమాకి ప్రమోషన్ వర్క్ మొదలుపెడతాననీ, ఈ దిశగా ఎంతో అనుభవం ఉన్న అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్, 'శ్వాస్' దర్శకుడు సందీప్ సావంత్ తనకు సహకరించనున్నారనీ ఆయన పేర్కొన్నారు.
Powered by web analytics software. |