దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. "రాజశేఖర్ రెడ్డి" అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ రెడ్డి హీరో పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది.
ఇదిలావుండగా, ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను స్వీకరించిన పూరీ జగన్నాథ్.. తన సొంత బ్యానర్ వైష్ణో ఆర్ట్స్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, తన తండ్రి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ సినిమా తీయాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే స్వయంగా పూరీ జగన్నాథ్‌ను కోరారట.
ఇందుకోసం ఆయనకు రెమ్యునరేషన్‌గా నాలుగు కోట్ల రూపాయలను ముందుగానే చెల్లించినట్టు రాజధాని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తన సొంత వ్యయంతో పూరీ బ్యానర్‌పై వైఎస్ జగనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే యువ పారిశ్రామికవేత్తగా మంచి పేరు సంపాదించిన జగన్.. చిత్ర నిర్మాతగా కూడా రాణించాలని ఆశిద్ధాం.