ఆంధ్రపదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆయన మరణవార్త విని ఎందరో చలించిపోయారు. అలాంటి వారిలో వైఎస్ సన్నిహితుడు ప్రముఖ నటుడు మోహన్‌బాబు,రాజశేఖర్,జీవిత,నాగర్జున,వెంకటేష్,ఇలాచెప్పుకుంటు పోతే అందరూ ఉంటారు కాని మోహన్ బాబు రూటే సెపరేట్ కనుక తన ప్రత్యేకతను నిరుపించుకుంటు మిడియా తో పంచుకుంటు కూడా ఒకరు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి సోమవారం ఆయన మీడియాతో పంచుకొన్నారు.సినిమా రంగంలోని ప్రముఖులతో ఈ చిత్రం విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నారు వైఎస్ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ చిత్రాన్ని నిర్మించడానికి మోహన్‌బాబు సంకల్పించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు డా.దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తారని సమాచారం. అందుకు సంబంధించిన తర్జనబర్జనలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రకి రజనీకాంత్‌ని సంప్రదించినట్లు తెలిసింది. గతంలో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ నటించిన ‘పెదరాయుడు’ చిత్రం ఎంతటి భారీ సక్సెస్‌ని సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో కూడా రాజారెడ్డి పాత్రకు రజనీ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఆ పాత్రకు ఆయన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో స్నేహ కథానాయికగా ఎంపికయినట్లు సమాచారం. త్వరలోనే మిగిలిన తారలు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగనుందని తాజా సమాచారం.