Free SMS And Earn Part Time Money







9/9/09

రెహ్మాన్ ది గ్రేట్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కు 'ఆస్కార్' అవార్డు తర్వాత మరో ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతమైంది. అమెరికాలో ఇటీవల జరిగిన 'జస్ట్ ప్లెయిన్ ఫోక్స్ 2009 మ్యూజిక్ అవార్డ్స్' కార్యక్రమంలో 'గ్రాస్ రూట్ గ్రామీ' అవార్డును రెహ్మాన్ గెలుచుకున్నారు. తమిళ 'గాడ్ ఫాదర్' (వరలారు) చిత్రం సౌండ్ ట్రాక్ కు బెస్ట్ ఇండియన్ ఆల్బమ్ కేటగిరిలో ఈ అవార్డును ఆయన గెలుచుకున్నారు. ఇదే 'వరలారు' చిత్రంలోని 'ఇన్నిసై' (రేడియో మిక్స్) సాంగ్ కు 'బెస్ట్ ఇండియన్ సాంగ్' కేటగిరిలో రెహ్మాన్ తృతీయ స్థానం దక్కించుకున్నారు. ఆయనే కంపోజ్ చేసిన 'ఇల్లామై' సాంగ్ ఐదవ స్థానంలో నిలిచింది.

'బెస్ట్ ఇండియన్ ఆల్బమ్' కేటగిరిలో ఇళయరాజా 'మ్యూజిక్ జర్నీ: లివ్ ఇన్ ఇటలీ'కి తృతీయ స్థానం దక్కింది. ఇండియన్ క్లాసికల్, ట్రెడిషనల్ ఆల్బమ్ కేటగిరిలో శ్వేతా జవేరి 'ఆవిష్కార్'కు ప్రథమ స్థానం లభించింది.



Powered by web analytics software.