Free SMS And Earn Part Time Money







12/17/10

1994 డిసెంబర్‌ 18న మరణించారు. అందుకే కాసేపు ఆమెను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.


అలనాటి నటీమణి సూర్యకాంతం. 1994 డిసెంబర్‌ 18న మరణించారు. అందుకే కాసేపు ఆమెను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. తెరపై గయ్యాళిగా కోడల్ని హింసించే అత్తగా కనిపించే సూర్యకాంతం తెర వెనుక నుంచి మనసున్న ఉత్తమరాలుగా అపినించుకున్నారు. ఎందరికో సాయం చేసి ఆపదల్లో ఆదుకున్నారు. పోషించిన పాత్రలు గయ్యాళివే అయినా సూర్యకాంతం వ్యక్తిగత మనస్తత్వం అందుకు భిన్నంగా ఉండేది.

అందరితోనూ ఎంతో అభిమానంగా మెలిగేవారు. వినోద పాత్రలు పోషించే నటికి డాక్టరేట్‌ రావడం అరుదుగా చెప్పుకోవచ్చు. ఆ ఘనత సూర్యకాంతానిదే. 1994 జులై 4న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌‌తో బహుకరించింది. దీంతో ఆమె డాక్టర్‌ సూర్యకాంతమయ్యారు. ఆమె మనసు వెన్న. సూర్యకాంతంకు మొదట హిందీలో హీరోయిన్‌‌గా అవకాశాలు వచ్చాయి.

ఆ పాత్రను నిర్మాత మొదట మరొకరికిచ్చి, ఆ తర్వాత సూర్యకాంతాన్ని చేయమన్నారు. వేరొకరు బాధపడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను? అని ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఆమె మధుమేహ వ్యాధితో బాధపడ్డారు.

ఆమె చివరి చిత్రం 'ఎస్‌.పి.పరుశురాం'. తనబొమ్మ సినిమా పోస్టర్ల మీద పడాలని కోరిక కలిగింది. ఆ కోరికే ఆమెను మద్రాసు వెళ్లేలా చేసింది. ఆమె 1994 డిసెంబర్‌ 18న మరణించారు. జెమినీ స్టూడియోలో వారు తీసిన 'చంద్రలేఖ' సినిమాలో డాన్సర్‌గా సూర్యకాంతానికి తొలి అవకాశం వచ్చింది.


Powered by web analytics software.