12/27/10
నాగబాబు భార్యగా పనికిరానా అంటూ నటి జయలలిత ప్రశ్నిస్తోంది
మెగాస్టార్ "గ్యాంగ్ లీడర్" చిత్రంలో రావుగోపాలరావు "మా చుక్క..." అంటూ పిలుపించుకుని వ్యాంప్ పాత్రలో కనబడిన ఆ "చుక్క" జయలలిత ఎందుకోగానీ ఈమధ్యకాలంలో సినిమాలకంటే టీవీ సీరియళ్లే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చింది. టీవీలో చక్కటి పాత్రలే వేస్తున్న ఆమె ఇక నుంచి ఇంకా ఇంకా మంచి పాత్ర ఉంటేనే చేస్తానని చెబుతోంది.
అందులో భాగంగానే తాను నాగబాబు భార్యగా పనికిరానా అంటూ నటి జయలలిత ప్రశ్నిస్తోంది. ఎవరినీ అంటే.. ఆమె భార్యను కాదండి బాబు... ఓ దర్శకుడిని. విషయం ఏమంటే.... నాగబాబు ప్రధాన పాత్రలో 'అపరంజి' అనే సీరియల్ షూటింగ్ జరుగుతోంది.
అతనికి భార్యగా మొదట ఓ నటిని అనుకున్నారు. ఆ తర్వాత చెల్లెలి పాత్రలో జయలలితను అడిగారు. కథంతా విన్నాక.. తాను నాగబాబు భార్యగా చేస్తానని పట్టుబట్టింది. దీంతో ఆమెకు ఆ పాత్రే ఇచ్చారు. ఈ పాత్రతో తన ఇమేజ్ పెరిగిపోయిందని చెబుతోంది జయలలిత. అందుకే సినిమాలు లేకపోయినా ఫర్వాలేదు. సీరియల్సే బెటర్ అంటోంది
Powered by web analytics software. |