12/21/10
కప్పుకాఫీ'లో ఉన్నాయని వక్తలు తెలిపారు
తెలుగుసినిమాలో సంగీత హోరులో సాహిత్యం మరుగునపడుతోంది. అటువంటివి లేకుండా చక్కటి సాహిత్యాన్ని వినగలిగే పాటలు విందైన సంగీతం 'కుదిరితే కప్పుకాఫీ'లో ఉన్నాయని వక్తలు తెలిపారు. వరుణ్‌సందేశ్, సంజన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి జయభేరి క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్‌రాజు, సి.కళ్యాణ్, ఆర్.పి.పట్నాయక్, కీరవాణి, అల్లరి నరేష్, వంశీకృష్ణ, తనీష్, భీమినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వారంతా చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్న సీతారామశాస్త్రి కుమారుడు యోగీశ్వరశర్మ(సాయి)ను అభినందించారు. చిత్ర దర్శకుడు రమణ సాల్వ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ముందుగా సంగీతదర్శకుడిని వేరేవారిని అనుకున్నాం. నిర్మాత మహితోపాటు గీతరచయిత శాస్త్రిగారు ఓ పాట గురించి చర్చించాం. 'ఏదో ఏదేదో...' అన్న పాటకు ట్యూన్ కట్టడం కాస్త కష్టంగా కనిపించింది. ఆనందం, విషాదం కలగలిపిన ఈ పాటకు ట్యూన్ ఎవరైతే బాగుంటుందోనని అనుకుంటుండగా మహి స్నహితుని ద్వారా సాయి తెలుసుకుని తాను ట్యూన్ కడతానని చెప్పాడు. సరే అని పాట ఇచ్చాం. సింగిల్ సిట్టింగ్‌లోనే చక్కటి ట్యూన్ ఇచ్చాడు. అది అందరికీ నచ్చింది. ఆ తర్వాత తెలిసింది అతను సీతారామశాస్త్రి కుమారుడని... భవిష్యత్‌లో తండ్రిని మించిన తనయుడు అవుతాడనే నమ్మకముందని చెప్పారు.
Powered by web analytics software. |