రక్తచరిత్ర అంటూ పరిటాల రవి - మద్దెలెచెర్వు సూరి జీవితాలను ఆధారంగా చేసుకుని వర్మ ఇటీవల రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాలు విడుదలైన సందర్భంలో అటు రవి, ఇటు సూరి వర్గీయులు వర్మపై కారాలు మిరియాలు నూరారు. వాటన్నిటినీ లెక్కచేయని రాము ఆ సినిమాలను పోలీసుల నడుమ విడుదల చేయాల్సి వచ్చింది.
అదలా ఉంచితే సోమవారం తన అనుచరుడు చేతిలో సూరి దారుణ హత్యకు గురవడం తనను కలచి వేసిందని సన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారం వ్యక్తం చేశారు. రక్తచరిత్ర చిత్రీకరణకు ముందు ఆయన అనుభవాలను తెలుసుకునేందుకు సూరితో ఏడాదిపాటు పలుమార్లు ఆయనను కలిశానని చెప్పుకున్నారు.
విగతజీవిగా సూరి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని వర్మ తన ట్విట్టర్ పేజీలో రాసుకున్నారు. అందరూ చెప్పుకుంటున్నట్లుగా సూరి మరణంతో తిరిగి రక్తచరిత్ర 3కి వర్మ పూనుకుంటారేమో... లెట్ అజ్ సీ..