అసలే ఇండస్ట్రీ బంద్‌లో ఉంది. ఎప్పుడు షూటింగ్‌లు జరుగుతాయో తెలియని పరిస్థితి. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకునేలా నిర్మాతలు వారికి ఎలా చెప్పాలని కిందామీద పడుతున్నారు. హీరోలకు ఎడాపెడా రెమ్యునరేషన్ పెంచేసింది నిర్మాతలే అనేది నగ్నసత్యం.
ఇటువంటి స్థితిలో హీరోలు కూడా ఓ మెట్టు దిగి వచ్చే స్థితిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరికొంతమంది హీరోలు డిమాండ్ సప్లయి మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇటీవలే ఓ ఉదంతం జరిగింది. ఓ నిర్మాత పవన్‌కళ్యాణ్ వద్దకు వెళ్ళి తాను 7కోట్లు ఇస్తానని డేట్స్ కావాలని అడిగాడట. దీంతో పవన్‌కళ్యాణ్ సీరియస్ అయి... ఇంత బంద్ జరుగుతున్నా నా దగ్గరకువచ్చి మీరిలా అడగడం భావ్యంకాదని కాస్త సున్నితంగా మందలించారట. దీంతో మరొకరితో ఫోన్‌చేయించినా ఫలితం లేకపోయింది.
వెంటనే నిర్మాతలమండలికి పవన్‌కళ్యాణ్ ఫోన్‌లోనే సంప్రదించి... ముందు మీరంతా కలిసికట్టుగా ఉండండి అంటూ సూచిస్తూ.... బడ్జెట్ కంట్రోల్ విషయంలో హీరోలపై నిందలు వస్తున్నాయి. అవన్నీ మీరు యూనిట్‌గా ఉండి ముందు పరిష్కరించుకోండి. ఆ తర్వాత మీరు ఏర్పాటుచేసే సమావేశానికి హాజరవుతాం. అప్పుడు మీడియా ముందు మా నిర్ణయం చెబుతామని వెల్లడించాడు.
దీంతో ఖంగుతిన్న నిర్మాతమండలి... పవన్‌కళ్యాణ్ చెప్పినదాంట్లో ఏమాత్రం తప్పులేదని గ్రహించాయి. దీనికి కారణమైన ఆ నిర్మాత ఎవరో కనుక్కుని ఆయన సభ్యత్వం పరిశీలించాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. సందడ్లో సడేమియా.. అంటే ఇదేమరి...