1/9/11
అమీర్ ఉచ్చులో కరీనా , రాణి
అమీర్ ఖాన్ మాటకు, చేతలకు హిందీలో భలే క్రేజుంది. అదే క్రేజుతో రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ ఓ చిత్రం కమిటయ్యారు. కామటీపురా టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో వీరిద్దరవీ వేశ్యా పాత్రలు. మొదట అమీర్ ఖాన్ ఫోన్ చేసి మరీ కలిసి సినిమా చేస్తున్నాం అనేసరికి మారు మాట్లాడకుండా కథ కూడా డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికి ముందుకొచ్చిన వీరికి గొంతులో వెలక్కాయ పడిన ఫీలింగ్ వచ్చిందంటున్నారు బాలీవుడ్ వాసులు. కరీనాకపూర్ అప్పట్లో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేసినా...ఇప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ సమయంలో ఇలాటి పాత్ర అంటే కొంచెం ఇబ్బందికరమేనంటున్నారు.
ఇక రాణీ ముఖర్జీ కెరీర్ చివరి దశలో పడి పెళ్లికి రెడి అవుతున్న సమయంలో ఇలాంటి క్యారెక్టర్ పడటం కొంత భాధేకరమని చెప్తున్నారు. అయితే వీరిద్దరూ బయిటకు మాత్రం అలాంటి వాస్తవిక చిత్రంలో నటించటం తమకి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నారు. తమలోని నటిని గ్యారిటీగా ఈ చిత్రం వెలికితీస్తుందని మురిసి పోతున్నారు. అదీ సంగతి. ఇక ఈ చిత్రం షూటింగ్ అంతా కామాటిపుర ఏరియాలోనే ప్లాన్ చేస్తున్నాడు అమీర్ ఖాన్.
Powered by web analytics software. |