జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరు దూరం కావాల్సిందేనని త్రిష వేదాంతాన్ని బోధిస్తోంది. ఈమధ్య ఆమెకు షూటింగ్‌లు పెద్దగా లేకపోవడానికి కారణమేమిటని అడిగితే... షూటింగ్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. షూటింగ్‌లలో కలిగే పరిచయాలు, పని వల్ల సమయం తెలీదు. దీనితోపాటు తెలియని ఉత్సాహం సొంతమవుతుంది. అందుకే ఎప్పుడూ పనిచేస్తుండాలని కోరుకుంటాను అని అంటోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలో ఏదో ఒకటి చేస్తుండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్న ఈ భామ... ప్రతి భాషకు సంబంధించిన కొత్తకొత్త విషయాలు, ఆయా మనుషుల మనస్తత్వాల్ని స్టడీ చేశానంటోంది. ఈ ప్రపంచం ఎంతో చిత్రమైందనీ, రకరకాల అనుభవాలన్నీఇక్కడే తెలుసుకుంటామనీ, భవిష్యత్‌లో ఏదో ఒక రోజు ఇండస్ట్రీకీ దూరంకావాల్సిందేననీ అంటోంది. దాంతో ఇక్కడివారి పలకరింపులకూ దూరమవుతాం. అదే జీవితం... అంటూ నిట్టూర్చింది.