Free SMS And Earn Part Time Money







1/25/11

కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అప్పల్రాజు ఫిబ్రవరి 4న విడుదల


రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అప్పల్రాజు చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సునీల్, స్వాతి, సాక్షి ఇందులో హీరోహీరోయిన్లు. వందిత కోనేరు సమర్పణలో శ్రేయ నిర్మాణంలో కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. సినిమా మొత్తం సినిమా నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలంటే ప్రాణం పెట్టే ఓ ప్రేక్షకుడు దర్శకునిగా మారి ఎలాంటి సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశం. వినోదానికి పెద్దపీట వేశాం. వారానికోపాటు చొప్పున ఆరు పాటలను మార్కెట్లోకి విడుదల చేశాం. పాటలకు విశేష స్పందన లభిస్తోంది. రాంగోపాల్ వర్మ ఈ చిత్రం ద్వారా పాటల రచయితగా పరిచయం కావడం విశేషం. వర్మ మార్కు వినోదం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 4న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని తెలిపారు. బ్రహ్మానందం, కోట, అలీ, తనికెళ్ల భరణి, ఎమ్మెస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి
రచన: నికేష్,
పాటలు: కలువ సాయి,రాంగోపాల్ వర్మ,
సంగీతం: కోటి,
సహనిర్మాత: సుమన్ వర్మ
Powered by web analytics software.