కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో సెకెండాఫ్ లో రవితేజ కనపడతాడు. ఒక్క ఛాన్స్ ఇమ్మని అవకాశం కోసం అప్పల్రాజు(సునీల్ )ని కలవడానికి వస్తాడు. ఈ పాత్ర గురించి వర్మ తాజాగా ఇంటర్వూలో చెబుతూ...సినిమా చూసి చాలా మంది ఒరిజనల్ రవితేజ అనుకున్నారు. ప్రేక్షకులు కూడా అదే ఫీలింగ్‌తో చూసారు. కాని అతను రవితేజ కాడు. రవితేజకు డూప్ అని తేల్చారు. అలాగే ఈ రంగంలో డూప్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్లకి సంబంధించి ఏదో ఒకటి చెప్పాలనుకొన్నపుడు రవితేజ డూప్ గుర్తొచ్చాడు.ఇక ఆ డూప్ పేరు టి. సుబ్రహ్మణ్యం, ఊరు అమలాపురం అని ఎడ్రస్ తెలిపారు. అయితే అతను డూప్ కాదని ఒరిజనల్ రవితేజ అని కావాలనే వర్మ ఇలా కల్పించి చెప్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం ఒరిజనల్ హీరోలుకు డూప్ లను చూపెట్టి ఒరిజనల్ అని చెప్పి, ఒరిజనల్ ని డూప్ అని నమ్మించే ప్రయత్నంచేస్తున్నాడని అంటున్నారు.