సినిమా సర్కూట్ లో మెగా కుటుంబం గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కొనిదల కోటలో విభేదాలు వచ్చాయని చిత్ర పరిశ్రమలో పుకారు. ఈ నేపథ్యంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకప్రక్క, చిరు, అల్లు అరవింద్ మరో ప్రక్క ఉండటాన్ని టాలీవుడ్ గమనిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ‘ఓవర్ సీన్’ హక్కులపై వచ్చే రెమ్యునరేషన్ విషయంలో రామ్ చరణ్ తో పోల్చుకొని, అవమానంగా ఫీలవుతున్నారని ‘ఫిలింనగర్’లో టాక్. ఇంతకీ కథ ఏమిటి..?‘రామ్ చరణ్’ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ను ఓవర్ సీస్ హక్కులు 2.8కోట్లకు పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘తీన్ మార్’ రీమేక్ కు రూ 1.8కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఈ ఆఫర్ ను చాలా అవమానంగా భావిస్తున్నాడట. ‘రామ్ చరణ్’కంటే నా సినిమాకు తక్కువగా ఇవ్వటం ఏమిటని, తన సన్నిహిలతుల వద్ద అంటున్నారని తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయాన్ని ఓవర్ సీస్ హక్కుదారులు త్రోసి పుచ్చారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వటం వలన, ఇంతకంటే మేము కొనలేమని ఓవర్ సీస్ హక్కుదారులు తేల్చిచెప్పారు. ఈ మధ్యనే ‘పులి’ దారుణంగా దెబ్బతినటం వలన ‘పవన్ కళ్యాణ్’ సినిమాపై ఇంతకంటే రిష్క్ తీసుకోదలచలేదని, ఓవర్ సీస్ హక్కుదారులు చెబుతున్నారు. ‘ఆరెంజ్’ ప్లాప్ అయినా, యూఏఏలో దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసిందని ప్రస్తుతం రామ్ చరణ్ కు ఆ డిమాండ్ లో ఉన్నాడని అంటున్నారు.