Free SMS And Earn Part Time Money







2/5/11

సో త్వరలోనే నాని 'సెగ పుట్టించటానికి రెడీ అవుతున్నాడు nityamenonతో


'అష్టాచమ్మా' చిత్రంతో కధానాయకుడిగా పరిచయమైన నాని తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. భీమిలి కబడ్డీ జట్టుతో బి, సి ఆడియన్స్ ను కూడా రీచ్ అయిన ఈ యువహీరో ఇటీవల 'అలా మొదలైంది' చిత్రంతో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తెలుగులోనే కాకుండా నాని తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో నాని 'వేప్పం' పేరుతొ ఓ సినిమా చేస్తున్నాడు. 'అలా మొదలైంది' చిత్రంలో నానితో రోమాన్స్ చేసిన నిత్య మీననే ఈ చిత్రంలో కూడా కధానాయిక.

'వేప్పం' అనగా వేడి అని అర్ధం. ఇక 'అలా మొదలైంది' హిట్ కావడంతో నాని మార్కెట్ వాల్యూ పెరగడంతో 'వేప్పం' తమిళ చిత్రాన్ని తెలుగులో 'సెగ' పేరుతొ అనువదించటానికి సన్నాహాలు చేస్తున్నారు. సో త్వరలోనే నాని 'సెగ పుట్టించటానికి రెడీ అవుతున్నాడు
Powered by web analytics software.