Free SMS And Earn Part Time Money







2/5/11

మళ్ళి వేసవి విజయం కోసం మహేష్, పవన్ , యన్.టి.ఆర్


పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషించిన ‘కొమరం పులి’, మహేష్‌ బాబు నటించిన ‘మహేష్ ఖలేజా’, ఎన్టీఆర్‌ తో తెరకెక్కిన‘బృందావనం’.. మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదల కావడం తెలిసిందే. మళ్లీ వేసవికి కూడా ఈ ముగ్గురు టాప్‌ హీరోల చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.పవన్‌ కళ్యాణ్‌ తో ‘లవ్‌ ఆజ్‌ కల్‌ ,మహేష్‌ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ‘దూకుడు",ఎన్టీఆర్‌ ‘శక్తి’ కూడా వేసవి వినోదం అందించేందుకు బరిలోకి దిగనున్నాయి.అంటే ఈ ముగ్గురి హిరోల చిత్రాలు మరోసారి ఒకటి తరవాత ఒకటి విడుదలకు సిద్దంగా ఉన్నాయనమాట ఇప్పటి ఈ మూడు చిత్రాలలో జూనియర్ యన్.టి.ఆర్ ముందుడగా రాబోయే చిత్రాలలో ఎవరు ముందుంటారో చూడాలి మరి......!!!!! ఈ ముగ్గురు మొనగాళ్లు మరొకసారి ‘ఢీ అంటే ఢీ’ అనబోతున్నారా అనే ఆసక్తికర చర్చ టాలీవుడ్‌ లో మొదలు కానుంది.
Powered by web analytics software.