Free SMS And Earn Part Time Money







3/1/11

అటువంటిదేమైనా ఉంటే సిగ్గులేకుండా చెప్తా:రీమాసేన్


"చిత్రం"తో టీనేజ్ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన బ్యూటీ రీమాసేన్. ఆ తర్వాత రెండు మూడు చిత్రాలతో మురిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతానికి టాలీవుడ్ కు దూరమైంది. అయితే నిత్యం వార్తల్లో నానుతూ ఉంటోంది. ఇటీవల ఈ భామ ఓ పురుషునితో ఎఫైర్ సాగిస్తోందనీ, ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిందనీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలను రీమాసేన్ లైట్ తీసుకుంది. పైగా వీటిపై ఆమెను కదిలిస్తే పకపక నవ్వుతూ... ఆ గాలివార్తలు నా చెవికీ చేరాయని చెప్పింది. కాకపోతే తనకిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదనీ, అసలు తనకు సినీ ఫ్రెండ్స్ తప్ప బాయ్‌ఫ్రెండ్స్ లేనేలేరని తెగేసి చెప్పింది. ఒకవేళ అటువంటిదేదైనా ఉంటే చెప్పేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడననీ, సిగ్గు లేకుండా చెప్పేస్తానని చెప్పుకొచ్చింది.
Powered by web analytics software.