3/16/11
తెలుగు మిడియాని తీసిపారేసిన రాం గోపాల్ వర్మ
రాంగోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో గొడవలో ఉంటూనే ఉంటాడు. పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఏదో విధంగా పాపులారిటీ రావాలనేది ఆయన తత్త్వం అని ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. తెలుగువాడు బాలీవుడ్ హవా చేస్తున్నాడని ప్రమోట్ చేసిన మీడియాకు వర్మ షాక్ ఇస్తే.... మీడియా కూడా చూసి చూసి షాక్ ఇచ్చింది. ఇటీవలే టీవీ9లో ఆయనపై నెగెటివ్ టాక్‌తో దాడిచేస్తే.... అదంతా ఒక డ్రామా అని తెలిసి.. వర్మను ప్రింట్ మీడియా అడిగింది.. కేసు పెడతానన్నారు. ఇంకా పెట్టలేదు ఏమిటని..? అసలు ఇదంతా మీకు సన్నిహితులైన జర్నలిస్టుల చేత నెగెటివ్‌గా ప్రచారం చేయించారని తెలిసిందని అడిగితే... కాసేపు ఆలోచింది.. అలా కూడా అనుకుంటున్నారా? అని దాటవేశారు. ఇదిలా ఉండగా... బుధవారం.. ఆయన 'దొంగలముఠా' ఆఫీసుకు రమ్మని కొంతమంది మీడియా మిత్రులను ఆహ్వానించారు. చెప్పిన టైమ్‌కు గంట దాటినా ఆయన జాడ లేదు. ఓ సీనియర్ ఇదేమిటని ఫోన్‌లో సంప్రదిస్తే... వేరే పనిపై బిజీగా ఉన్నాను. మీరు అందరూ అక్కడే వెయిట్ చేయండని తాపీగా జవాబు చెప్పారట. దీంతో అహం దెబ్బతిన్న మీడియా మిత్రులు శాపనార్థాలు పెడుతూ వర్మ మీట్‌ను బాయ్‌కాట్ చేశారు. ఇదే బాలీవుడ్‌లో అయితే నానారకాలుగా రాస్తారనీ, తెలుగు మీడియా చెప్పినట్లు రాస్తుందని అంటుండే రాంగోపాల్‌వర్మ తెలుగువారికి ఇచ్చిన గౌరవం ఇదేనా..!
Powered by web analytics software. |