Free SMS And Earn Part Time Money







11/22/10

"ఆరెంజ్" అనేది ఓ రంగు:పవన్ కల్యాణ్‌ కి కథ నచ్చలేదు.


"ఆరెంజ్" అనేది ఓ రంగు. ఈ పేరునే రామ్‌చరణ్ మూడో సినిమాకు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆరెంజ్ పండుని వలిచినట్లుండేట్లుగా ముందుగా పోస్టర్లను తీర్చిదిద్దారు. అయితే అది బాగోలేదని మార్చారు.

ఇక కథ గురించి చెప్పాలంటే... ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు జరిగాయి. వాటిని కథగా అల్లి దర్శకుడు భాస్కర్, నిర్మాత నాగబాబు ముందుంచాడు. ముందుగా పవన్ కల్యాణ్‌తో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నారు. ఆయనకు ఆ కథ నచ్చలేదు. "ఖుషి" తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం కనబడింది. అయితే రొటీన్‌గా ఉంటుందని తిరస్కరించాడట.

ఆ తర్వాత కథను కొద్దిగా మార్చి రామ్‌చరణ్‌కు చెప్పాడు. అందులో కొద్దిగా క్లారిటీ దెబ్బతినడంతో మళ్లీ కొత్త వర్షెన్ రాసుకుని వచ్చాడు. అప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. దాన్ని నాగబాబుకు వినిపించారు. నాగబాబు కాంప్రమైజ్ కాలేదు. చెప్పే విధానంలోనూ తీసే విధానంలో కొత్తదనాన్ని జోడించి మరోసారి ముందుకు వచ్చాడు. దాంతో నాగబాబు అంగీకరించారు. ప్రధానంగా చరణ్‌ను కొత్తగా చూపించే విధానం నచ్చింది.

ఈ ఆరెంజ్ సినిమాలో రామ్‌చరణ్ పేరు రామ్. ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఒక వ్యాపకం ఉంటుంది. కానీ మరోవైపు గోడలపై బొమ్మలు గీయడం అతని వృత్తి. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో అవి నిషిద్ధం. అలాంటిచోట గీచిన బొమ్మల వల్ల పోలీసులతో చిక్కుల్లో పడతాడు. అదే సమయంలో జెనీలియా పరిచయమవుతుంది. ఆమె అక్కడ కాలేజీ స్టూడెంట్. చాలా ఎనర్జెటిక్. ఫాస్ట్. అక్కడ విద్యార్థులపై జరిగిన దాడుల్లో వారికి సహాయం చేసే క్రమంలో ఇద్దరు కలుస్తారు. అలా ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
Powered by web analytics software.