Free SMS And Earn Part Time Money







11/22/10

సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి:[Bommarillu Bhaskar]



ఒకే మూస పద్ధతిలో పోవడం చరణ్‌ కు ఇష్టం లేదు. భిన్నమైన రోల్స్‌ చేయాలనే తపన ఉన్న కథానాయకుడు. ఆయనతో కలిసినప్పుడు 'నాకు తగినట్టుగా మీ స్టైల్లో చెయ్యండి' అని అన్నారు మగధీర తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని తపన పడుతున్నాడు. . తను ప్రత్యేకంగా విదేశీ నేపథ్యంలో కథ అయితే బాగుంటుందని చెప్పారు అలా తయారైందే ఆరెంజ్ చిత్రం అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..సినిమా చేసే వ్యక్తిని నేను. ముందు నేను సంతృప్తి చెందాలి. చరణ్‌ను ఏ కోణంలో చూపిస్తే కొత్తగా ఉంటుందనే విషయం గురించి ఆలోచించా. చిరుత, మగధీరలో మాస్‌ను మెప్పించే అంశాలు చాలా ఉన్నాయి. నాశైలిలో ఉండే ప్రేమకథ ఇది.ఇక కథ విషయానికి వస్తే..ముందు కథను సిద్ధం చేసుకుంటా. ఆ తర్వాతే నటీనటుల ఎంపిక.

కానీ ఇక్కడ...అందుకు భిన్నంగా జరిగింది. చరణ్‌ను కలిసినపుడు ఓ సినిమా చేద్దాం అన్నారు. నా దగ్గరున్న కథ వినిపించా. అందుకు తగ్గట్టుగా ఆరెంజ్‌ కథ తయారైంది అన్నారు. రామ్‌చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్‌లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
Powered by web analytics software.