Free SMS And Earn Part Time Money







11/22/10

భక్తవత్సలం [Mohan Babu] వచ్చి 35 ఏళ్లు గడిచింది.


భక్తవత్సలం నుంచి తన గురువు దాసరి ద్వారా పేరు మార్చుకున్న ఎవర్‌గ్రీన్ నటుడు మోహన్‌బాబు సినిమా రంగానికి వచ్చి 35 ఏళ్లు గడిచింది. గురువు దాసరి పెట్టిన భిక్ష "స్వర్గం - నరకం". అందులో మోహన్ బాబు జీవించాడు. ఎవడురా... ఇంతటి విలనిజాన్ని పండించినవాడని ఇండస్ట్రీ యావత్తూ ఆయనపై దృష్టి పెట్టింది. గాత్రంతోపాటు శారీరక ఆకర్షణ విలనిజానికి ప్రత్యేకతను చూపించాడు.

ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్టీఆర్‌తో ధీటుగా నటించి మెప్పించిన నటుడు ఆయనే. చిరంజీవితోకూడా కలిసి నటించినా మోహన్‌బాబు ధాటికి చిరంజీవి కూడా తట్టుకోలేకపోయాడు. తెల్లదొర పాత్రలోనూ ఒదిగిపోయాడు. ప్రస్తుతం తన కుటుంబాన్ని ఈ పరిశ్రమకే అంకితం చేశాడు. అడపాదడపా తనూ నటిస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నాడు.

విష్ణు, మనోజ్‌లు కథానాయకులుగా నటిస్తుండగా కుమార్తె లక్ష్మీప్రసన్న నిర్మాతగా సాగుతోంది. మోహన్‌బాబు మార్చి 19, 1952లో జన్మించారు. చెన్నైలో పి.డి కోర్సు చదివారు. ఆ తర్వాత డ్రిల్ మాస్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి... ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించారు. డైరెక్టర్ డిపార్ట్‌మెంట్‌లో 1970లో ప్రవేశించారు. 1975 నవంబరు 22న ఆయన నటించిన తొలిచిత్రం స్వర్గం - నరకం చిత్రం విడుదలైంది.

35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మజిలీలు. విలన్‌గా, కథానాయకునిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన ఆయన కెరీర్‌లో పద్శశ్రీ అవార్డును కూడా పొందారు. భరతముని, వంశీబర్కిలీ వంటి పలు కల్చరల్ అవార్డులను పొందారు. "మా" అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

ప్రతిజ్ఞ, అల్లుడుగారు, రౌడీపెళ్లాం, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి, యమదొంగ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలే ఘనవిజయాలు సాధించిపెట్టాయి.

ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కల ఆయన తన తోటి నటీనటులతోనూ అదేవిధంగా ప్రవర్తిస్తాడు. సెట్ లో ఉండాలంటే నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. నేడు దర్శకులు చాలామంది నేర్చుకోవలసిన అంశమిది. యమదొంగలో ఆయన డెడికేషన్ చూసి రాజమౌళి దంపతులే ఆశ్చర్యపోయారు. ఆ మధ్య ఓ సందర్భంలో ఆయనను ఇంటర్య్వూ చేయడం జరిగింది.

మిమ్మల్ని చూసి అందరూ భయపడుతుంటారట.. కారణం...?

ఇది ఇండస్ట్రీలో నెలకొన్న ధోరణి. ఎక్కడ సిన్సియారిటీ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. అది ఒక్కోసారి మైనస్‌గాను ఉంటుంది. అంటూ... ప్రక్కనే ఉన్న బ్రహ్మానందాన్ని పిలిచి, ఇదిగో... బ్రహ్మీ.. నేనంటే నీకు భయమా..? అని అడిగారు. వెంటనే బ్రహ్మానందం.. మీరంటే ఎవరికి భయమెవరకి ఉండదండీ... అందుకే అందరూ సైలెన్స్‌గా ఉంది.

మీతో నటించడం టెన్షన్‌గా కూడా ఉంటుంది. పేమెంట్ ఇస్తారో లేదోనని.. అంటూ అధినేత షూటింగ్‌లో బ్రహ్మానందం చెప్పాడు. దానికి మోహన్‌బాబు స్పందిస్తూ... కొన్ని సీక్రెట్లు బయటకు చెప్పకూడదయ్యా. అయితే నీకు పేమెంట్‌లో కొంత కట్ అంటూ.. ఏదో నవ్వులాటకు అన్నాను అంటూ స్పందించారు మోహన్ బాబు.

చాలా సరదాగా సెట్లో జోకులతో ఉండే మోహన్ బాబు తేడా వస్తే తన కన్నకొడుకుల్నైనా వదలడు. ఝుమ్మంది నాదం షూటింగ్‌కు మనోజ్ కాస్త లేట్‌గా వస్తే.. చడామడా తిట్టేసి.. రాత్రంతా తిరగడం, తాగడం.. డిసిప్లిన్ తప్పాడంటూ.. అందరి ముందే వేలెత్తి చూపాడు. ఇలా చెపితే.. ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ, తన నటగురువు ఎన్టీఆర్ గురించి మాత్రం గొప్పగా చెపుతారు. నడకలో, నడతలోనూ, ఆంగికాభినయాల్లో అన్న ఎన్టీఆరే తనకు ఆదర్శం అని చెపుతారు మోహన్‌బాబు





Powered by web analytics software.