12/18/10
మంచి సూచన ఎవరిచ్చిన తీసుకొ చిరంజీవి:
మెగాస్టార్ అంటూ చిత్రసీమను ఏలిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి తెగ మాట్లాడుతున్నారు. లేటెస్ట్‌గా రైతుల సమస్యల గురించి తెగ మాట్లాడుతున్నారు. అసలు ఆయన్ను ఇంతవాడ్ని చేసిన చలనచిత్రరంగం సమస్యల్లో ఉంటే దాన్ని వదిలేసి రైతుల గురించి మాట్లాడడం ఏమి న్యాయమ"ని ఫిలింఛాంబర్ కార్యవర్గ సభ్యుడు నిర్మాత నట్టికుమార్ ప్రశ్నిస్తున్నారు.
చిత్రసీమ సమస్యల్ని పరిష్కరించడానికి గత పదిరోజులుగా బంద్ నిర్వహిస్తోంది. గతమూడురోజులనాడు నిర్మాతలు దర్శకులు సమావేశానికి చిరంజీవి కూడా హాజరయ్యారు. సినిమా నిర్మాణంలో అవగాహన లేక దర్శకులు ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఆక్షేపించారు. ఎటువంటి సమస్యలున్నా తాను తీరుస్తానని హామీ ఇచ్చారు.
అయితే అక్కడ ఆయన ఎక్కువసేపు లేకపోవడంతో తగు విధంగా స్పందించే అవకాశం కుదరలేదు. అందుకే నట్టికుమార్ శనివారంనాడు మీడియా సమావేశంలో చిరంజీవికి ఈ రకంగా సూచించారు. మీ కాంపౌండ్ హీరోలు నటించిన కొమరంపులి, ఆరెంజ్ చిత్రాల నిర్మాణంలో నిర్మాత నష్టపోవడం ఒక ఎత్తయితే, దాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు రోడ్డున పడ్డారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు రైతులతో సమానం, కళామతల్లిని పోషిస్తుంది వాళ్ళే. దయచేసి ముందు ఇంటిసమస్యను పరిష్కరించండి. ఆ తర్వాత బయట సమస్యలు పరిష్కరించవచ్చని సూచించారు.
రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకోండి
తమిళనాడులో రజనీకాంత్ బాబాకు నష్టపోయిన వారికి కొంతలో కొంత పరిహారాన్ని ఇచ్చారు. మన రాష్ట్రంలో కృష్ణగారు అలా ఇచ్చేవారు. నేనుకూడా మా అన్నయ్యబంగారం సినిమా తీశాక నష్టపోయిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత పరిహారం ఇచ్చాను. దయచేసి మీ కాంపాండ్‌లో, ఈ డిస్ట్రిబ్యూషన్‌లో వస్తున్న సినిమాలను కొన్నవారు నష్టపోతే వారికి తర్వాత సినిమా ఇస్తామన్నా హామీ అయినా ఇవ్వండి. అప్పుడు రైతులు(వారు) హ్యాపీగా ఉంటారని సూచించారు.
Powered by web analytics software. |