12/23/10
ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది.(p)review
మదన గోపాల్ (మాధవన్), అంబుజం త్రిష ప్రేమికులు. ఓ విషయమై మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మాధవన్ తన ప్రియురాల్ని మరచిపోలేడు. అయితే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్టిస్టుగా సెటిలైందని తెలుసుకుంటాడు. అప్పుడు ఆమె మనసులో తాను ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు ఓ డిటెక్టివ్ ఆర్.మన్నార్ ని (కమల్‌హాసన్)ఆశ్రయిస్తాడు. ఆర్.మన్నార్..మిలిట్రీలో మేజర్ గా రిటైరై డిటెక్టివివ్ ఏజిన్సీ నడుపుతూంటాడు. ఇక అంబుజం మనస్సులో ఏముందో తెలుసుకునేందుకు కమల్ బయిలుదేరతాడు. ఆమె ప్రతీ షూటింగ్ కు హాజరవుతాడు. కొద్ది రోజుల్లోనే వారిద్దరూ క్లోజ్ ప్రెండ్స్ అయిపోతారు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.
ఆ డిటెక్షన్ విషయం కమల్ హాసన్ ప్రేయసి దీప కి తెలియక అపార్దాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఆమె అంబుజానికి బాల్య స్నేహితురాలు. ఈ చిక్కు ముడులన్నిటినీ మాధవన్ ఎలా విడతీసి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది కామిడీ ఆఫ్ ఎర్రర్ ఫార్మెట్ లో సాగుతుంది. ఇక తమిళ హీరో సూర్య ఈ చిత్రంలో త్రిష సరసన ఓ పాటలో కనపడతాడు. అలాగే త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఈ చిత్రంలో కీరోల్ చేస్తోంది. కమల్ హాసన్, ఆయన ఫేవరెట్ రైటర్ క్రేజీ మోహన్ కలిసి ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.
కమల్ హాసన్, దర్శకుడు కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన దశావతారం, తెనాలి, పంచతంత్ర వంటి హిట్ చిత్రాల కోవలో ఈ చిత్రం కూడా హిలేరియస్ కామిడీ పండిస్తుందంటున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. రచన: వెన్నెలకంటి, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది.
Powered by web analytics software. |