1/8/11
తమన్నాలాంటి అమ్మాయి పెళ్ళాంగా రావాలి:కార్తీ
నాకు తమన్నాలాంటి అమ్మాయి పెళ్ళాంగా రావాలి అంటున్నాడు తమిళ స్టార్ హీరో కార్తీ. రీసెంట్ ప్రముఖ తమిళ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ఇలా కామెంట్ చేసి చాలా కాలంగా వీరి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న రూమర్స్ కు అధి ఆధారం కల్పించినట్లయింది. తాజాగా రవితేజ,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు రీమేక్ సిరుతైలో నటిస్తున్న కార్తి ఇలా మాట్లాడి హాట్ టాపిక్ గా మారాడు. ఇక ఆయన సోదరుడు సూర్య కూడా తన తోటి హీరోయిన్ జ్యోతికను చేసుకుని సెటిల్ అయినట్లే కార్తీ కూడా తమన్నాను వివాహమాడుతాడని అంటున్నారు.అయితే తమన్నా మాత్రం అసలు కార్తీ గురించి తనకేమీ తెలియదని, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏమీ లేదని, పదే పదే ఆ విషయం ప్రస్తావించవద్దని చెప్పింది.
అయినా మీడియా వాళ్ళు పదే పదే ఆ విషయమే అడిగేసరికి విసుగుచెందిన తమన్నాఇటువంటి విషయాలకు తన తల్లిదండ్రులకు తప్ప ఇంకెవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పి మీడియా నోరు మూయించింది. అసలు తను అటువంటి రూమర్స్ ను పెద్దగా పట్టించుకోనని, తన కెరీర్ లో తాను చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని, అయినా తన జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి తన తల్లిదండ్రులకు మాత్రమే ఉండాలని తమన్నా తేల్చి చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ చిత్రంలో మరియు సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.
Powered by web analytics software. |