1/31/11
బాబయ్ కి దాసరికి చిక్కకుండా తిరుగుతున్న జూనియర్.యన్.టి.ఆర్
సింహా’లో నటన చూసిన తరువాత ఒక్క బాలయ్యను చూడటానికే రెండు కళ్లు సరిపోలేదు. అటువంటి ‘పరమవీర చక్ర’లో బాబాయ్ రావణబ్రహ్మగా పది తలకాయలు చూడడానికి ఎన్నికళ్లైనా చాలవు’ అంటూ పరమవీర చక్ర పబ్లిసిటీ కోసం జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు నిజమైనట్టే ఉన్నాయి. ఎన్నికళ్లయినా సరిపోవు అన్న యంగ్ టైగర్ కి బాలయ్య‘పరమవీర చక్ర’ దెబ్బతో ఉన్న ఆ రెండు కళ్లూ పోయినట్టుగానే ఉన్నాయి అంటూ అభిమానులు భయపడిపోతున్నారు. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జూ ఎన్టీఆర్ ‘పరమవీర చక్ర’ విడుదద నుండి నెల రోజులుగా కనపడటంలేదు. అభిమానులకు కనీసం బాలయ్య సినిమాకు రిపోర్టు అడగటానికైనా వస్తాడనుకుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నట్టు..దాసరి దాటికి కనపడకుండా ఉన్నాడా..అని ట్విట్టర్ అభిమానుల ఆందోళన చెందుతున్నారు.
Powered by web analytics software. |