డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించినా, ఆయన దర్శకుడిగా ఎంత ఎత్తుకి ఎదిగినా, ఆయన తత్వం మాత్రం విచిత్రంగానే ఉంటుంది. ఆయన చేసే పనులు చాలా మందికి మూర్ఖంగా అనిపిస్తాయి. దర్శకుడయ్యాక ఇలాంటి పద్థతి వర్మ అలవర్చుకోలేదు. చిన్నప్పట్నుంచీ వర్మ ఇంతేనట. అందుకే అతడిని అంతా ‘మూర్ఖుడు’అని ముద్దుగా పిలుచుకునేవారట. ఇప్పుడు అదే టైటిల్ తో వర్మ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నారని సమాచారం. అన్నిఓకే అయిన తర్వాత ఫిబ్రవరి 15నుండి షూటింగ్ జరగుతుందని దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు. వర్మ సినీ జీవితం కాకుండా ఇందులో ఆయన కాలేజీ జీవితాన్ని చూపిస్తారట. కాలేజీలో వర్మ చేసిన పనులు, అతని స్నేహితులు, అఫైర్లు వగైరా అన్నింటినీ అధ్యయనం చేసి మరీ ఈ సినిమా తీస్తున్నారు. తన జీవిత కథతో సినిమా తీస్తూ ‘మూర్ఖుడు’ అనే టైటిల్ పెడితే వేరే ఎవరైనా ఫీలవుతారేమో కానీ వర్మ మాత్రం హర్టవ్వడు. పైగా ఇదంతా తనకు ఉచిత పబ్లిసిటీ ఇస్తుందని సంబరపడతాడు.