2/8/11
ఖలేజా కొమరంపులి అదుర్స్ ఈ మూడు సూరి హత్య కేసులో
ఎన్టీఆర్ తో అదుర్స్ చిత్రాన్ని నిర్మించిన వల్లభనేని వంశీని పోలిస్ లు విచారించారు. మద్దెల చెర్వు సూరి హత్య కేసుకు సంబందించి ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ గతంలో విజయవాడ నగరంలో చేసిన సెటిల్ మెంట్ ను వంశీ బయటపెట్టిన సంగతి తెలిసిందే.
విజయవాడలోని అన్నపూర్ణ సంస్థ యజమానులైన అన్నదమ్ముల మధ్య వచ్చిన స్పర్ధలను తనకు అనుకూలంగా మార్చుకున్న భానుకిరణ్ వారిని బెదిరించి, అందులో డైరెక్టర్ గా చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. భాను, మధులను కోవర్టులుగా మార్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వల్లభనేని వంశీ, పరిటాల రవి పెద్ద కుమారుడు శ్రీరామ్ హత్యకు వ్యూహరచన చేసారని భానుమతి ఆరోపించారు. దీంతో సీసీఎస్ పోలీసులు వంశీని హైదరాబాద్ కు పిలిపించి రెండు గంటల పాటు విచారించారు
కొమరం పులి, ఖలేజా చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందుతుడైన భాను కు అత్యంత సన్నిహితుడైన సంగతి అందరికి తెలిసిందే. కాగా రమేష్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
రమేష్ పై నమోదైన కేసుల్లో పోలీసు విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పైనాన్షియర్ వైజయంతిరెడ్డి ని బెదిరించినట్లుగా, షాలిమార్ వీడియోస్ అధినేత అష్రప్ ను కూడా రమేష్ బెదిరింపు చర్యలకు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి.
Powered by web analytics software. |