గ్లామర్ విషయంలో నాకు పట్టింపులేం లేవు. కానీ మరీ అసభ్యంగా ఉంటే నా వల్లకాదు. డబ్బు సంపాదించుకొనేందుకు ఈ రంగంలోకి రాలేదు. హీరోయిన్స్ పోస్టర్ మీద అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు. తెర మీద ప్రతిభ చూపించాలి. లేదంటే రెండో సినిమాకే వెనక్కి వెళ్లిపోవాల్సివస్తుంది అంటూ లెక్చర్స్ ఇస్తోంది రిచా గంగోపాధ్యాయ. లీడర్ తో పరిచయమైన ఈ భామ మిరపకాయ్ చిత్రంతో నిలదొక్కుకుంది. రెండో చిత్రం నాగవల్లి నిరాశపరిచినా ఈమె నటనకు మంచి మార్కులె పడ్డాయి. ఇక ఆమె తనకు వచ్చే ఆఫర్స్ గురించి చెబుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. నటిగా నిలదొక్కుకోవాలి అని ఆశ పడుతున్నా. అందుకు ఒకే ఒక దారి ఉంది...మంచి పాత్రలు పోషించడం. అంతే తప్ప..అవకాశాల కోసం వెంపర్లాడను అంది. ఇక మిరపకాయ్లో తనకు వచ్చిన అవకాశం గురించి చెబుతూ..అలాగే తనకు ఆ పాత్ర ఎలా వచ్చిందో చెపుతూ...దర్శకుడు హరీష్ శంకర్ వినమ్ర పాత్ర నా కోసమే రాసుకొన్నారు. అయితే 'లీడర్' పంక్షన్ లో నన్ను చూసి 'అమెరికా అమ్మాయివి కదా. లంగావోణీ పాత్ర నీకు నప్పదేమో. వైశాలిగా చేయ్' అన్నారు. కానీ నాకు వినమ్ర పాత్ర నచ్చింది. నేను ఎందుకు చేయలేను...అని సవాల్‌గా తీసుకొన్నాను. అప్పటికి షూటింగ్‌కి ఇంకా సమయం ఉండడంతో నా పాత్ర తీరుతెన్నులను బాగా పరిశీలించాను అందుకే క్లిక్కయింది అంటోంది