రామ్ గోపాల్ వర్మ తాజా ప్రయోగాత్మక చిత్రం దొంగలముఠా ఈ రోజే(శుక్రవారం) విడుదల అవుతోంది. ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కథ ఓ కామిక్ ధ్రిల్లర్ లా సాగుతుందని తెలుస్తోంది. కథ ప్రకారం సుధీర్(రవితేజ),రాణి(ఛార్మి) స్నేహితురాలు వివాహంకి అటెండ్ అవటానకి ఓ నిర్మానష్యుమైన రోడ్డులో ప్రయాణిస్తూంటారు. హటాత్తుగా కారు ఆగిపోతుంది. వారు దగ్గరలో ఓ హోటల్ ఉండటాన్ని గమనిస్తారు. వారు ఆ హోటల్ లోకి వెళ్ళగానే అక్కడ వారు ఓ కారుని ఇచ్చి ప్రక్కనున్న విలేజ్ లోకి వెళ్ళి మెకానిక్ ని తెచ్చుకోమంటారు. కానీ వారు నీ భార్యని తీసుకెళ్ళద్దు అంటారు. దాంటో సుధీర్ చాలా ఇరిటేట్ అవుతాడు. వారిని గెట్ అవుట్ అని అరుస్తాడు. తర్వాత వారి ప్రక్క గదిలోంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. కానీ చూస్తే ఆ గది తాళం వేసి ఉంటుంది. మెల్లి మెల్లిగా సుధీర్ కి తాము ట్రాప్ అయ్యామనిడు ఆర్ డై సిట్యువేషన్ లో ఇరుక్కున్నామని అర్దమవుతుంది. ఇంతకి అక్కడి స్టాప్ మరెవరో కాదు..ఓ దొంగలముఠా. వారు ఓ బ్యాంక్ ని దోచి అక్కడ మేనేజర్ (బ్రహ్మానందం) ని అదుపులోకి తీసుకుని బంధించి దాక్కుని ఉంటారు. ఆ దొంగలముఠాకి ఓ నాయకురాలు(లక్ష్మీ ప్రసన్న) ఉంటుంది. ఆమె ఆధ్వర్యంలో అంతా జరుగుతూంటుంది. చివరకు ఆ చెరనుంచి సుధీర్, రాణి ఎలా తప్పించుకున్నారనేది మిగతా కథ. ఈ కథ హాలీవుడ్ లో వచ్చిన ద వేకిన్సీ చిత్రం నుంచి ప్రేరణ పొంది తయారు అయ్యిందని అంతటా వినపడుతోంది.