3/18/11
.వర్మ కనిపిస్తే.. కొట్టేటట్లున్నారని.. థియేటర్ యజమాని అనడం విశేషం...ఇది దొంగలముఠా రివ్యూ
నటీనటులు: రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజు, సునీల్, లక్ష్మీమంచు, సత్యప్రకాష్, బ్రహ్మాజీ,సుప్రీత్‌లు, కెమెరా:ఎఫ్‌ఎక్స్ స్కూల్, నిర్మాత: కిరణ్‌కుమార్ కోనేరు, సంగీతం: అమర్ మోహ్లే, దర్శత్వం: రామ్‌గోపాల్‌వర్మ + హరీష్‌శంకర్. పాయింట్: ఓ ముఠా ద్వారా కిడ్నాప్ అయిన బ్రహ్మానందాన్ని కనిపెట్టే ఓ జంట. ఈ చిత్ర సమీక్ష రాయడానికి కారణం కేవలం రామ్‌గోపాల్‌వర్మ అనే పెద్ద దర్శకుడు సినిమా తీశాడననిన్నూ, రవితేజతోపాటు పలువురు ప్రముఖులు నటించారననిన్నూను. అంతకుమించి ఈ చిత్రంలో ఏమీలేదు. చూసినవాడు తలబాదుకోవడం ఖాయం. వెబ్‌దునియాలో అంతకుముందు పాఠకులు చదివినట్లే.... చార్మి.. అందాలపైనే వర్మ కెమెరాను ఫోకస్ చేయడం.. దర్శకత్వంతోపాటు వర్మ కెమెరామెన్ అవతారమెత్తడం మరో విశేషం. కొత్త ప్రయోగాలు చేయవచ్చు. కానీ ఆప్రయోగాలు ఎలా చేశారు. దాని గురించి వివరంగా చెప్పేందుకు దర్శకుడు, నిర్మాత సాహసించాలి. ఏదో గుడ్డిలో మెల్లగా రాత్రిరాత్రే వచ్చిన ఆలోచనతో సినిమా చుట్టేసి.. గొప్ప ప్రయోగం చేశామనుకోవడం భ్రమే అవుతుందని చూసిన ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు. కామెరూన్ అనే స్టిల్ కెమెరాతో కూడా సినిమా తీయవచ్చు. అనేది చెప్పడానికి వర్మ చేసిన ప్రయోగం. కానీ... ఆ కెమెరాతో పగలు షూటింగ్ చేస్తే క్లారిటీ బాగానే వస్తుందనేది అందరికీ తెలిసిందే. కానీ వెలుగులేని గదుల్లో కూడా క్లారిటీగా రావడం విశేషం. లైట్లు లేకుండా ఎలా తీయగలిగాడు..? అనేది వివరంగా వర్మ చెప్పలేకపోయాడు. అసలు లైట్లు పెద్దగా వాడలేదన్నాడు. కెమెరాకు సరైన లైటు లేకపోతే క్లారిటీ రాదు. వస్తే ఇన్నాళ్ళు ఆ కెమెరాను ఎందుకు వాడలేదు. పైగా కెమెరా ఎలా వాడారో తెలియజెప్పేందుకు... యూనిట్ ఎవరినీ తీసుకెళ్ళకుండా వర్మ జాగ్రత్తపడ్డాడు. ఐదు రోజుల సినిమా.. ఆర్టిస్టులకు పారితోషికాలు ఇవ్వలేదని వర్మ చెబితే నమ్మాలేమో.. ఒక్కరోజులో తమిళం, మలయాళంలో ఓ చిత్రాన్ని తీశారు. అందులో ప్రముఖ హీరోలు నటించారు. ఆ విషయం వర్మను అడిగితే... ఆ చిత్రం గురించి నాకు తెలీదు అన్నాడు... మరి ఈయన చిత్రం గురించి ఎవరికి తెలియాలని ఎవరైనా అడిగితే... సమాధానం ఏం వస్తుందో తర్వాత చూద్దాం... ఇక కథలోకి వెళితే.... సత్యప్రకాష్ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేస్తాడు.. కట్‌చేస్తే... దంపతులైన సుధీర్(రవితేజ), రాణి (చార్మి)లు ఓ వివాహానికి వెళుతూ కారు పాడవడంతో మెకానిక్‌కోసం కొంచెం దూరంగా ఉన్న ఓ హోటల్‌కు వెళతారు. అక్కడ సుబ్బరాజు, సుప్రీత్, బ్రహ్మాజీలుంటారు. వారు హోటల్ నిర్వాహకులు. వారికి ఓ రూమ్ ఇస్తారు. ఈ రాత్రి అక్కడే ఉండి తెల్లారి వెళ్ళానుకుంటారు. వారి రూమ్ పక్క రూమ్‌లో రాణికి విచిత్రమైన అరుపులు విన్పిస్తుంటాయి. పైగా ఆ ముగ్గురి ప్రవర్తనపై అనుమానం వస్తుంది. వారి పిచ్చి ప్రవర్తనతో సుధీర్ విసిగిపోయి అక్కడ నుంచి బయటపడాలనుకుంటాడు. కానీ వారు వెళ్ళనివ్వరు. రాణిపై మోజుతో వారు తనకు రూమ్ ఇచ్చారని సుధీర్ గ్రహిస్తాడు. ఆ తర్వాత పోలీసు ఆఫీసర్ ప్రకాష్‌రాజ్ ఎంటరవుతాడు. ఆ తర్వాత మంచు లక్ష్మి, సునీల్ వస్తారు. కొన్ని సంఘటనలు జరిగాక... లక్ష్మీమంచు తాను పోలీసు ఆఫీసర్ అని ట్విస్ట్ ఇస్తుంది. మరి ప్రకాష్‌రాజ్ దొంగ అన్నమాట... ఇలా ఎందుకు అనేది తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటే సినిమాకెళ్ళాలి. ఈ చిత్రంలో పాత్రధారులు ప్రత్యేకంగా నటించింది ఏమీలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా అంతా లాగించేశాడు. అనవసరపు సౌండ్ సిస్టమ్స్‌తో... నటీనటులు ఒకరినొకరు వింతగా చూసుకోవడం... చార్మి పిరుదలు, నాభి ప్రాంతాలపైనే కెమెరాను కావాల్సింత మేర ఉంచినట్లు తెలుస్తుంది. సీరియల్స్‌లో ఇటువంటి ప్రయోగాలుంటాయి. రోడ్డుపై నుంచి రిసార్ట్ రావడానికి పావుగంట చూపించాడు. ఇది సీరియల్‌గానైనా జనాలు చూడరేమో. టైటిల్‌కు కథకు సంబంధం లేదు. దొంగతనం అనేది జరగదు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేస్తారు. అంటే.... తాను ముందుగా చెప్పేది ఒకటి తర్వాత చూపించేది ఒకటని... వర్మ మరోమారు నిరూపించాడు. అప్పల్రాజు సినిమాను అలాగే చేశాడు. కేవలం క్లోజప్‌షాట్స్, మిడ్ షాట్స్‌తోనే సినిమా అంతా లాగించేశాడు. చివరగా... రూపాయి ఖర్చు లేకుండా లక్షలు ఎలా సంపాదించాలి? అనే ఆలోచనతో వర్మ ఈ చిత్రాన్ని తీశాడని తెలుస్తుంది. లేదంటే..... ఏ మాత్రం ఖర్చులేకుండా... తనకున్న పరిచయాలతోనే ఓ డాక్యుమెంటరీలా చుట్టేసి ప్రేక్షకులు జేబులు కొట్టడానికే ఈ సినిమా తీశారా అనిపిస్తుంది. ట్విస్ట్ ఏమంటే..... హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ...వర్మ కనిపిస్తే.. కొట్టేటట్లున్నారని.. థియేటర్ యజమాని అనడం విశేషం...
Powered by web analytics software. |