కత్రినా టురుక్యూట్ ! ఈ పేరు ఎప్పుడైనా విన్నారా...ఇది కత్రినా అసలుపేరంట. తన పాస్‌పోర్టులో ఇలానే ఉందట. బూమ్ చిత్రం ద్వారా పరిచయమైన కత్రినా కైఫ్ కాశ్మీరీ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిందట. తండ్రి మహ్మద్ కైఫ్, తల్లి క్రిస్టియన్‌కు చెందిన సుజానే టుర్‌క్యూట్. హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా ఇంగ్లాండ్‌లో పెరిగి, ముందుగా మోడలింగ్‌లో చేరి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిందట. ఈ వివరాలన్నీ కత్రినా చెబుతోంది. అయితే తన పేరు పలకడం కష్టం అవుతుందనీ కత్రినా కైఫ్‌గా మార్చుకుందట.