Free SMS And Earn Part Time Money







12/3/10

సూర్యను కథానాయకుడిగా చేశాడా ........???


పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన రక్తచరిత్ర చిత్రంలో మొదటి పార్ట్‌లో రవిని హీరోగా చూపించిన వర్మ రెండవ పార్టుకొచ్చేసరికి విలన్‌గా చూపించాడు. సూర్యను కథానాయకుడిగా చేశాడు. ఇది క్లుప్తంగా కథ. కర్ర విరగదు. పాము చావదు అన్న సామెతలా తెరకెక్కించాడు.

మొదటి భాగంలో రవి(వివేక్ ఒబెరాయ్) రాజకీయాల్లోకి వస్తాడు. అంతకుముందు తన తండ్రిని వారిని చంపే ప్రయత్నంలో రాజకీయ అస్త్రం ఉపయోగిస్తాడు. రాజకీయాల్లో శివాజీరావ్(శతృఘ్న సిన్హా) స్థాపించిన పార్టీలో చేరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి శక్తిగా నిలబడతాడు. కానీ, ఈ ఎదుగుదలకు సహించలేని సూర్యనారాయణ రెడ్డి(సూర్య) రగిలిపోతుంటాడు. అతను ఎవరనేది రెండవ భాగంలో వస్తుంది.

ప్రతాప్ రవిపై ఉన్నట్టుండి బాంబు దాడి జరగడంతో ఒక్కసారిగా ప్రభుత్వంతోపాటు ప్రజలు ఉలిక్కిపడతారు. ఈ కేసును పరిశోధించే మోహన్ ప్రసాద్(సుదీప్)కి రవిని హత్య చేసేందుకు సూర్య కుట్ర పన్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సూర్య భార్య భవానీ(ప్రియమణి)ని బంధించి సూర్య చట్టానికి లొంగేలా చేస్తాడు. ఇంకేముంది చెరసాలలోనే రవిని ఎలా చంపాలనే ప్లాన్ చేస్తాడు. వీరి కక్షలను కొందరు రాజకీయనాయకులు వాడుకుంటారు.

భవానీని ఒక పార్టీ రాజకీయాల్లోకి దించుతుంది. రాజకీయంగా ఆమెను ఎదుర్కోవడం కుదరక ఆమెను చంపాలని రవి అనుకుంటారు. కానీ భార్యను ముందుగా వారించి తర్వాత జరిగిన ఓ సంఘటనలో మీ ఇష్టం అంటుంది. ఆ టైంలో సూర్యతో భేటీ అయిన రవికి చుక్కెదురవుతుంది. జైల్లో స్నేహితుడైన ముద్దుకృష్ణతో రవిపై దాడి చేయిస్తాడు సూర్య. ఆ తర్వాత సూర్య రవిని చంపేస్తాడు. ఇదీ కథ.

కానీ వర్మ మొదట నుంచి చెప్పినట్లుగా సూరి, పరిటాల సునీత వంటివారితో ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారితో చర్చించి తీసిన సినిమా అన్నాడు. అందులో కొంత కల్పితంతో తీశాడు. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొదటి భాగంలో పెద్దసార్ అంటూ కెమేరాలో కన్పించే వ్యక్తి ఈ పార్టులో ఉండడు. అతను వైఎస్ రాజారెడ్డి అని అప్పుడు అనుకున్నారు. ఓ హీరోను గుండు గీయించే సన్నివేశం లేదు. అది ఫోటోలకే పరిమితమైంది. ఒక భావోద్వేగంతో తీసిన ఈ చిత్రం అటుఇటూగా ఉంది. మొదటి భాగం చూసినవారికే రెండవ భాగం చూడాలనిపిస్తుంది. కొత్తగా చూసేవారికి పెద్దగా అన్పించదు.

ఇక పాత్రల విషయానికి వస్తే... సూరి పాత్రలో సూర్య జీవించాడు. కటకటాల వెనుక ఉండి కుట్రలు పన్నడంలో ఆరితేరిన విధంగా నటించి మెప్పించాడు. ప్రియమణి, ఆప్టే పాత్రలు అమిరాయి. వారిద్దరి పాత్రలు మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సూరి, రవి పాత్రలు మినహా అసలు కథలో ఉండే ముద్దుకృష్ణ తదితర పాత్రలకు ప్రాధాన్యం లేదు.

పెద్దగా చెప్పాలంటే ఫోటోగ్రఫీ హైలెట్. యాక్షన్, థ్రిల్లర్ సినిమాకు వర్మ సౌండింగ్ అద్భుతంగా రాబట్టుకున్నాడు. నేపథ్య సంగీతం బాగుంది. నాగేశ్వరరావు మాటల చతురత్వం ఫర్వాలేదు. ఏదోవిధంగా పబ్లిసిటీ చేసుకుని కలెక్షన్లు రాబట్టుకునే వర్మ ఈ చిత్రానికి ఆ ప్రయోగం చేశాడు. సర్కార్ తరహాలో ఈ చిత్రాన్ని మలిచాడు. ప్రేక్షకుల ఆదరణ ఏస్థాయిలో ఉంటుందో చూడాలి
Powered by web analytics software.