ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన జై బోలో తెలంగాణ సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి. కొద్దిపాటి కట్స్‌కు శంకర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాంతో సినిమాకు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయడానికి శంకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డు సినిమాను ముంబైలోని జాతీయ సెన్సార్ బోర్డుకు పంపింది. జాతీయ సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపింది. భాస్కరరావు నేతృత్వంలోని రివైజింగ్ కమిటీ గురువారం సమావేశమై సినిమాకు క్లీన్ చిట్ ఇచ్చింది.
సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడం పట్ల శంకర్ హర్షం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులు మానసిక వికాసంతో నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. సినిమాకు ఇంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తుందని అనుకోలేదని, అయితే తెలంగాణ ప్రజల పోరాటం వల్ల అది సాధ్యమైందని, వారికి చేతులెత్తి మొక్కుతున్నానని ఆయన అన్నారు. సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.