Free SMS And Earn Part Time Money







1/28/11

దేవికి ఈ సినిమా ఓ ఛాలెంజ్ [చిక్కుగా]గా నిలవబోతోంది. Gabbar singh


పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ గా రీమేక్ చేయబోతున్న ఒరిజినల్ ‘దబాంగ్’సినిమాయే కాదు మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో ఎక్కువ అవార్డులు ‘దబాంగ్’కే రావడం విశేషం. 2010 సంవత్సరానికి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా ‘దబాంగ్’ ఎంపికైంది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా సాజిద్-వాజిద్, సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ‘మున్నీ బద్నామ్..’ ఈ పాట పాడిన మమతా శర్మను అప్ కమింగ్ సింగర్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సందీప్ శిరోద్కర్ కు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డులకు ఎంపిక చేశారు. ఇవే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి సంగీత విభాగంలో మరికొన్ని అవార్డులు గెలుచుకుంది ‘దబాంగ్’. మరి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మ్యూజిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో మరి. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నట్టు తెలిసింది. తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవికి ఈ సినిమా ఓ ఛాలెంజ్ [చిక్కుగా]గా నిలవబోతోంది. హిందీలో మ్యూజికల్ హిట్ అయిన చిత్రానికి తెలుగులో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.. మరి ముఖ్యంగా 'మున్నీ బద్నాం 'సాంగ్ రీమేక్ అంటే మాటలు కాదు దేవి శ్రీ ప్రసాద్ కిది అవార్డులు తేస్తుందో చీవాట్లు తెస్తుందో వేచిచూడాలి
Powered by web analytics software.