2/7/11
"a" సర్టిఫికేట్ పై హిరోయిన్ మండిపాటు పర్వలేదనుకున్న డైరక్టర్
ఎ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన సినిమా హిట్ అయ్యేదాన్ని అది ఆపలేదు. సినిమాకు స్టోరీనే ప్రాణం. అది మాత్రమే సినిమాను ఆడిస్తుంది. సెన్సార్ బోర్డ్ ఇచ్చే సర్టిఫికెట్ మీద హిట్,ప్లాప్ అనేవి ఆధారపడి ఉండవు. సినిమా బాగుందనే టాక్ స్ప్రెడ్ అయితే ప్రేక్షకులు వాళ్లంతట వాళ్లే థియేటర్‌కు వస్తారు అంటోంది ప్రియాంచోప్రా. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాజా చిత్రం ।7 ఖూన్ మాఫ్ కి ఎ సర్టిఫికేట్ ఇచ్చారని కోపంతో మండిపడుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ విషయంపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ..మా సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఫర్వాలేదు. సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పలేదు. అదే చాలు. నేనొక సినిమా తీసేటప్పుడు ఫలానా సర్టిఫికెట్ పొందాలని టార్గెట్ చేసుకుని తీయను. నేనకున్నది తెరకెక్కిస్తా. ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఆమోదిస్తా .అయినా సినిమా ప్రారంభించినప్పట్నుంచి దీనికి ఎ సర్టిఫికెటే వస్తుందని మేం అనుకున్నాం. అందుకని ఆశ్చర్యపడలేదు అంటున్నారు విశాల్ భరద్వాజ్.
Powered by web analytics software. |